శివ కుమార్ వారసత్వాన్నందుకుని సూర్య హీరోగా గొప్ప స్థాయికి చేరితే.. అతడి వారసత్వాన్నందుకుని కార్తి కథానాయకుడిగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. తొలి సినిమా ‘పరుత్తి వీరన్’తోనే అతడికి చాలా పేరొచ్చింది. ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలతో సాగిపోతున్నాడు కార్తి. ఏ సినిమాలోనూ అన్నయ్యను అనుకరించకుండా తనదైన శైలిలో సాగిపోతున్నాడతను. అతడిని చూస్తే తనకు చాలా గర్వంగా ఉందని అంటున్నాడు సూర్య. ఎప్పుడూ తమ్ముడిని పెద్దగా పొగడని సూర్య.. అతడి కొత్త సినిమా ‘చినబాబు’ ఆడియో లాంచ్ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు.
తమిళంలో ఒక సామెత ఉంటుందని చెబుతూ.. తోడుగా ఒక సోదరుడు ఉంటే పెద్ద సైన్యాన్నయినా ఓడించవచ్చని.. తనకు కార్తి అలాంటి సోదరుడే అని సూర్య అన్నాడు. అతడి సినిమాల ఎంపిక చూస్తే తనకు గర్వంగా అనిపిస్తుందని.. వైవిధ్యమైన సినిమాలతో సాగిపోతున్నాడని సూర్య చెప్పాడు. తమ సొంత ప్రొడక్షన్లో ఇది ఐదో సినిమా అని.. ప్రతిసారీ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నామని.. ‘చినబాబు’ సినిమా రైతుల మీద తీసిందని.. వాళ్లకే ఈ చిత్రం అంకితమని సూర్య తెలిపాడు. అనంతరం కార్తి మాట్లాడుతూ.. ఇది ఎంతో ప్రేమతో చేసిన సినిమా అన్నాడు. ఈ సినిమాతో మళ్లీ రైతును హీరోగా మార్చామని.. తాను ఇందులో రైతుగా నటించానని.. తాను చాలా గర్వించే పాత్ర ఇదని చెప్పాడు. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య సరసన ‘అఖిల్’ భామ సాయేషా కథానాయికగా నటించింది.జులై రెండో వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.