విడుదలైన ఏడాదికి సూర్య సినిమాకు మోక్షం

Update: 2019-03-10 01:30 GMT
ఒకప్పుడు ఓ సినిమా రిలీజై దూర దర్శన్ లో రావాలి అంటే యుగాలు పట్టేది. తర్వాత శాటిలైట్ ఛానల్స్ విప్లవం వచ్చాక క్రమంగా అది తగ్గుతూ వచ్చింది. ఎప్పుడైతే పోటీ పెరగడం మొదలైందో నెలల నుంచి ఆఖరికి రోజుల్లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వచ్చాక సీన్ ఇంకా దారుణంగా మారిపోయింది. కేవలం 30 రోజులు లేదా మహా అంటే 45 రోజులు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే వీళ్ళ యాప్ లో ప్రత్యక్షం అవ్వాల్సిందే. వీటినే లోకల్ సిటీ కేబుల్ ఛానల్స్ లో వేసుకోవడం ఇప్పుడు మాములు విషయంగా మారిపోయింది.

అలాంటిది ఓ సినిమా విడుదలైన ఏడాది తర్వాత టీవీ ఛానల్ లో రావడం అంటే వింతేగా. ఆ బాపతులోకే వస్తోంది సూర్య గ్యాంగ్.  గత సంవత్సరం పవన్ అజ్ఞాతవాసి బాలయ్య జైసింహతో పోటీ పడిన సూర్య గ్యాంగ్ రేపు ఓ ప్రముఖ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతోంది. ఇప్పటిదాకా తెలుగు వెర్షన్ టీవీ లో కానీ ఆన్ లైన్ లో కానీ రాలేదు.

ఆఖరికి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కు కూడా దీని హక్కులను ఇవ్వలేదు. అప్పుడు ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ హిందీ బ్లాక్ బస్టర్ స్పెషల్ చబ్బీస్ కి రీమేక్. కీర్తి సురేష్ హీరోయిన్ కాబట్టి ఎంతో కొంత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించకపోదు. ఇది వచ్చిన ఐదు నెలలకు మహానటి విడుదలైంది. సో గ్యాంగ్ బాగా లేట్ గా వస్తున్నా బిల్డప్ మాత్రం భారీగా ఉంది. నయనతార లవర్ కం కాబోయే విజ్ఞేశ్ శివన్ దీనికి దర్శకుడు.
Tags:    

Similar News