సూర్య క్ష‌మాప‌ణ చెప్పాడు

Update: 2016-05-16 08:07 GMT
స్టార్ కంటే ముందు నేనొక బాధ్య‌త‌గల పౌరుడినని చెబుతుంటాడు క‌థానాయ‌కుడు సూర్య‌. స‌మాజానికి  చేతనైనంతగా  సేవ చేయాల‌ని  త‌పిస్తుంటాడాయ‌న‌. అగ‌రం ఫౌండేష‌న్ అనే ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌ని ఏర్పాటు చేసి పేద విద్యార్థుల‌కి చ‌దువు చెప్పిస్తున్నాడు.  అలాంటి సూర్య  ఓ విష‌యంలో ప్ర‌జ‌లంద‌రినీ క్ష‌మాప‌ణ కోరాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓటు వేయలేక‌పోతున్నందుకే   ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పాడు.

ప్ర‌స్తుతం కుటుంబంతో క‌లిసి అమెరికాలో హాలీడేస్‌ ని ఎంజాయ్ చేస్తున్నాడు సూర్య‌. మ‌రికొన్నాళ్ల‌పాటు తిరిగి రావ‌డం కుద‌ర‌ద‌ట. తిరిగి రాలేని ప‌రిస్థితుల్లో ఉన్నందుకే నేను పోలింగ్‌ ని మిస్స‌య్యాన‌నీ, కానీ ఈ విష‌యంలో  నాకు చాలా ఎంబ‌రాసింగ్‌ గా వుంద‌ని   అమెరికా నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు సూర్య‌. ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ త‌ప్ప‌నిస‌రిగా ఓటు హ‌క్కుని వినియోగించుకుంటుంటాడు సూర్య‌. ఈసారి అమెరికాలో ఉండ‌డంవల్ల   కుద‌ర‌డం లేద‌న్నమాట‌. కానీ ఆయ‌న కుటుంబ స‌భ్యులు మాత్రం ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

ఇత‌ర  త‌మిళ‌స్టార్లంతా ఉత్సాహంగా ఓటు హ‌క్కుని వినియోగించుకుంటున్నారు. ర‌జ‌నీకాంత్ - క‌మ‌ల్‌ హాస‌న్‌ -  అజిత్‌ - విజ‌య్‌ - విశాల్‌ - ఆర్య త‌దిత‌రులంతా ఉద‌యాన్నే  పోలింగు బూతుల‌కి చేరుకొని ఓటు హ‌క్కుని వినియోగించుకున్నారు.  సినిమా షూటింగ్‌ వ‌ల్ల ఈ సారి ఓటు వేయ‌డం కుద‌రదేమో అని చెప్పిన క‌మ‌ల్ కూడా షూటింగ్‌ ని ప‌క్క‌న‌పెట్టి ఓటింగ్‌ లో పాల్గొన్నాడు. ఆయ‌న కూతురు అక్ష‌ర హాస‌న్ కూడా ఓటు హ‌క్కుని వినియోగించుకుంది.
Tags:    

Similar News