ఇప్పుడు కొంత మార్కెట్ తగ్గింది కానీ తమిళ హీరో సూర్యకు ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. రొటీన్ కథలను కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్స్ తో అలరిస్తాడని పేరున్న సూర్యకు సింగం సిరీస్ టాలీవుడ్ లో కమర్షియల్ గా ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసి పెట్టింది. గత ఏడాది గ్యాంగ్ తో ఓ మోస్తరు యావరేజ్ ఫలితాన్ని అందుకున్న సూర్య కొత్త మల్టీ స్టారర్ కాప్పన్ షూటింగ్ చివరి దశలో ఉంది. మోహన్ లాల్ తో పాటు ఆర్య నటిస్తున్న ఈ మూవీకి కెవి ఆనంద్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సూర్యతో ఈయన గతంలో చేసిన వీరుడొక్కడే-బ్రదర్స్ ఇక్కడ కూడా బాగానే ఆడాయి. వీటి కంటే మెరుగ్గా రంగం తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇకపోతే ఈ కాప్పన్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్ డేట్ హాట్ టాపిక్ గా మారింది. వాటి ప్రకారం ఇందులో మోహన్ లాల్ ప్రధాన మంత్రి పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నిరంతరం కంటికి రెప్పలా కాపాడే సెక్యూరిటీ చీఫ్ గా సూర్య ఉంటాడు. ఇక ఆర్య దేశ భద్రతను సవాల్ చేసే టెర్రరిస్ట్ గా చాలా టిపికల్ రోల్ లో కనిపిస్తాడట. అయితే దీనికి మన రాజశేఖర్ కు ఓ లింక్ ఉంది. పాతికేళ్ల క్రితం అంగరక్షకుడు అనే సినిమా ఒకటి వచ్చింది. అందులో సోమయాజులు ముఖ్యమంత్రిగా నటించగా ఆయన్ను కాపాడే ఆఫీసర్ గా రాజశేఖర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. మీనా హీరోయిన్. మలయాళ దర్శకుడు జోషి తీసిన ఈ మూవీ అప్పట్లో యావరేజ్ గానే నిలిచింది.
కప్పన్ లో సీఎం బదులు పిఎం ఉంటాడు. అదే తేడా. అయితే స్టోరీ లైన్ లో బ్యాక్ డ్రాప్ లో ఇంకా చాలా మార్పులు ఉంటాయి కానీ మెయిన్ లైన్ మాత్రం దాంతో మ్యాచ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని కాప్పన్ లో సాయేషా హీరోయిన్ గా నటిస్తుండగా బోమన్ ఇరానీ మరో కీలక పాత్ర చేస్తున్నారు.ఇటీవలి కాలంలో భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న లైకా సంస్థనే దీన్ని నిర్మిస్తుండటం విశేషం.