సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలు చేసేస్తూ కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకడైన సూర్య కెరీర్ బాగానే కొనసాగిస్తున్నాడు. అది ఏ సినిమా అయినా తమిళంలోనే కాక తెలుగు లో కూడా విడుదల చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైపోతూ వచ్చాడు. మొన్ననే గ్యాంగ్ సినిమా తో బోలెడన్ని కలెక్షన్స్ కురిపించిన ఈ గజిని ఇప్పుడు ఎం సినిమా చేయబోతున్నాడు?
7/జి బృందావన్ కాలనీ - ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి ఫీల్ గుడ్ సినిమాలు తీసిన సెల్వరాఘవన్ ఇప్పుడు సూర్య తరువాతి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరూ మొదటిసారి కలిసి చేయబోతున్నారు. ఈ సినిమా తాలూకా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇవాళే విడుదల చేశారు. సూర్య ఇన్ అండ్ యాజ్ ఎన్.జి.కె అంటూ టైటిల్ ని రిలీజ్ చేసిన పోస్టర్ లో సూర్య గెడ్డం పెంచి, గాగుల్స్ లో చాలా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటిదాకా ఎప్పుడు చూడనట్టుగా ఫాన్స్ సూర్య ని చూడబోతున్నారు అని ఈ పోస్టర్ చెప్పకనే చెప్తోంది. అయితే మనోడు ఛే గువేరా కు దగ్గర్లోని లుక్కుతో మరి ఎన్.జి.కె అంటే అదేదో ఏం.జి.ఆర్ అన్న తరహాలో ఏం మెసేజ్ ఇస్తాడో అనే అనుకోవాలి.
తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, మరియు సాయి పల్లవి హీరోయిన్లు గా చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా స్వరాలు చేకూరుస్తుండగా అరువి లాంటి పాత్ బ్రేకింగ్ సినిమా ని నిర్మించిన డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్ బాన్నేరే ఈ సినిమాను కూడా నిర్మించడం విశేషం.