కోలీవుడ్ హీరో సూర్య నటించిన సింగం సీక్వెల్ ఎస్ 3 నిజానికి ఇవాళే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ డీమానిటైజేషన్ తో పాటు.. చెన్నైలో తుఫాన్ వంటి సమస్యలతో ఈ చిత్రాన్ని వాయదా వేయాల్సి వచ్చింది. వాయిదా తప్పనిసరి పరిస్థితుల్లో సంక్రాంతికి కాకుండా రిపబ్లిక్ డే వరకూ.. అంటే దాదాపు నెల రోజుల వెనక్కు వెళ్లడాన్ని అందరూ అభినందించారు కూడా. తమిళ్ వెర్షన్ కు ఎంతో మేలు చేసే అంశమే.
కానీ తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి తేడా వచ్చేస్తోంది. తెలుగులో రిపబ్లిక్ డే నాడు వస్తున్న పెద్ద మూవీ వెంకటేష్ నటించిన గురు ఒక్కటే. కానీ అసలు సమస్య ఏంటంటే.. అదే రోజున రెండు బాలీవుడ్ చిత్రాలు విడుదలవుతున్నాయి. షారూక్ నటించిన రయీస్ తో పాటు.. హృతిక్ రోషన్ మూవీ కాబిల్ కూడా రిపబ్లిక్ డే సందర్బంగానే రిలీజ్ కానుంది. కాబిల్ తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ కానుండడంతో.. అన్ని ఏరియాల్లోనూ థియేటర్ల పోటీ తప్పని పరస్థితి నెలకొంది. ఇప్పుడు గురు.. రాయీస్.. కాబిల్(బలం) చిత్రాలతో పాటు ఎస్3 పోటీ పడాల్సి ఉంటుంది.
కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే ముందు థియేటర్స్ కోసమే బోలెడంత పోటీ తప్పదు. ఎస్3 ఇక్కడ ఏకంగా 20 కోట్ల రూపాయల బిజినెస్ చేయాల్సి ఉండడంతో ఇప్పుడు జనవరి 26కి S3 ని పోస్ట్ పోన్ చేయడం పెద్ద రిస్క్ అయిపోయింది అంటున్నారు విశ్లేషకులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/