మాస్.. ఇంతకంటే ఏం కావాలి బాస్

Update: 2017-02-10 04:57 GMT
గతంలో రొటీన్ మాస్ సినిమాల మధ్య ఎప్పుడో ఒక వైవిధ్యమైన సినిమా వచ్చేది. రొటీన్ కమర్షియల్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. స్టార్ హీరోలందరూ వైవిధ్యమైన సినిమాల బాట పట్టారు. మాస్ సినిమాలకు సెలవిచ్చేశారు. దీంతో మాస్ ప్రేక్షకులు అన్యాయమైపోతున్నారు. నాటు టేస్టు దొరక్క ఓ వర్గం ప్రేక్షకులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి వాళ్ల కోసమే వచ్చింది ‘సింగం-3’.

సూర్య ఎక్కువగా వైవిధ్యమైన సినిమాలే చేస్తారు. అదే సమయంలో అప్పుడప్పుడూ ఒక మాస్ సినిమాతో పలకరిస్తుంటాడు. అతడిని మాస్ ప్రేక్షకులకు బాగా చేరువ చేసిన సినిమా ‘సింగం’. ఆ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్టయింది. ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా అతుక్కుపోతారు జనాలు. దీనికి కొనసాగింపుగా వచ్చిన సింగం-2 కూడా మాస్ ప్రేక్షకుల్ని మురిపించింది. ఇప్పుడు మాస్ సినిమాలు బాగా కరువైపోతున్న రోజుల్లో ఆ వర్గం ప్రేక్షకులకు విందు భోజనంలా దొరికింది ‘సింగం-3’.

కొన్ని దశాబ్దాల కిందట్నుంచి తెలుగు ప్రేక్షకులు సైతం మన హీరో అన్నట్లుగా థియేటర్లలో ఊగిపోయేది రజినీకాంత్ విషయంలోనే. ఆ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ సూర్యకు మాత్రమే సొంతం. ముఖ్యంగా ‘సింగం-3’ సినిమా థియేటర్లకు వెళ్తే రెస్పాన్స్ చూస్తే కళ్లు తిరిగిపోతాయి. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కొంచెం కామ్ గానే ఉంటారు కానీ.. సింగిల్ స్క్రీన్లలో.. మాస్ సెంటర్లలో అయితే ‘సింగం-3’కి రెస్పాన్స్ మామూలుగా లేదు. మన టాలీవుడ్ స్టార్ హీరోల తరహాలో థియేటర్లు హోరెత్తించేస్తున్నారు.

‘సింగం-3’ ఆడియన్స్. ఇందులో గూస్ బంప్స్ మూమెంట్లకు కొదవలేదు. హీరోయిజాన్ని ఓ రేంజిలో పండించేశారు హరి-సూర్య. ఇంటర్వెల్ ముందు హీరో తొలిసారి తన దూకుడు చూపించే సీన్ కావచ్చు.. ఆస్ట్రేలియాలో హీరోకు ఝలక్ ఇచ్చే సీన్ కావచ్చు.. ఇలా మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే సీన్స్ చాలానే ఉన్నాయి ‘సింగం-3’లో. ఈ చిత్రానికి బి-సి సెంటర్లలో కలెక్షన్లు అదిరిపోతాయని అంచనా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News