నాలుగేళ్ల కిందటే సూర్య సినిమాకు తెలుగులో రూ.15 కోట్ల రేటు పలికింది. ‘బ్రదర్స్’ సినిమాకు బెల్లంకొండ సురేష్ ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టాడు. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది. ఆ తర్వాత కూడా సూర్య వరుసగా ఫ్లాపులే ఇవ్వడంతో క్రమ క్రమంగా తెలుగులో అతడి మార్కెట్ దెబ్బతింది. ‘రాక్షసుడు’ టైంకి పది కోట్ల మార్కుకు పడిపోయాడు సూర్య. ఐతే ‘24’ సినిమా సూర్యకు తెలుగులో పునర్వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు మంచి రేటు పలికింది. కలెక్షన్లు కూడా అంచనాలకు తగ్గట్లే వచ్చాయి. ఈ ఊపులో తన తర్వాతి సినిమాకు మంచి రేటు తెచ్చుుకున్నాడు సూర్య.
సూర్య-హరి కాంబినేషన్లో ‘సింగం’ సిరీస్ లో వస్తున్న మూడో సినిమా ‘ఎస్-3’కి తెలుగులో రికార్డు రేటు పలికింది. ఈ చిత్రం ఏపీ-తెలంగాణ హక్కుల్ని మాల్కాపురం శివకుమార్ ఏకంగా రూ.18 కోట్లు పెట్టి కొనడం విశేషం. రజినీకాంత్.. శంకర్ సినిమాల్ని మినహాయిస్తే తమిళ అనువాదాల్లో అత్యధిక రేటు పలికింది ఈ సినిమాకే అని చెప్పాలి. అంటే ఈ సినిమా పాతిక కోట్ల దాకా గ్రాస్ వసూలు చేస్తే తప్ప బయ్యర్లు బయటపడటం కష్టమన్నమాట. సినిమా సూపర్ హిట్ అయితే తప్ప కష్టమే. ఐతే ‘సింగం’ సిరీస్ మీద ఉన్న అంచనాల ప్రకారం చూస్తే ఈ పెట్టుబడి మరీ ప్రమాదకరమేమీ కాదని చెప్పొచ్చు. సూర్యకు తోడు ఇందులో శ్రుతి హాసన్.. అనుష్క కూడా ఉన్నారు కాబట్టి సినిమా ఓ మోస్తరుగా ఉన్నా సూపర్ హిట్టయ్యే అవకాశాలున్నాయి. అక్టోబరు 28న ‘ఎస్-3’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.