హీరో సూర్య హిందీ పరిశ్రమకు వెళుతున్నారా? అంటే అవుననే సమాచారం. స్నేహితురాలు నందిత సింఘాతో కలిసి అతడు ఓ త్రిభాషా చిత్రం నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీలో ఈ చిత్రం తెరకెక్కనుంది. నందిత సింఘా ప్రధాన పెట్టుబడిదారు. సూర్య సహనిర్మాతగా కొనసాగుతారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయి. హిందీ వెర్షన్‌లో సూర్య సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుందని సమాచారం.
ఇకపోతే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సెట్స్‌కెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. సూర్య ఈ చిత్రంలో మరో ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నారు. జీరో టు హీరో ఎదిగేవాడిగా కనిపించనున్నాడు. ప్రారంభం వీక్‌గా ఏ విషయం లేని ఓ సగటు కుర్రాడిలా కనిపిస్తాడు. అంత బలహీనుడు అనూహ్యంగా సూపర్ హీరో ఎలా అయ్యాడన్నదే కథాంశం. సూర్య ప్రస్తుతం విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. అలాగే జ్యోతిక ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమాని నిర్మించాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే దక్షిణాదిన నాలుగు సినిమాలు నిర్మించాడు. ఇప్పుడు హిందీ సినిమా ఐదవది.