ప్రయోగాలు చేయడంలో కోలీవుడ్ హీరోలు ముందు వరసలో ఉంటారు. వాళ్లు స్టార్ - ఇమేజ్ - స్టేటస్... ఇలాంటివేవీ పట్టించుకోరు. మంచి కథ అనిపిస్తే వెంటనే ఓకే చెప్పేస్తుంటారు. సూర్యలాంటి ఓ స్టార్ హీరో బాలల చిత్రంలో నటించడమంటే ఆషామాషీనా? కానీ కథపై నమ్మకంతో ఆయన నటించాడు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం తమిళంలో `పసంగ 2` పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదట్లో ఈ సినిమాకి హైకూ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ పాండిరాజ్ ఇదివరకు తీసిన పసంగ ఘన విజయం సాధించింది. అందుకే ఈ సినిమాకి `పసంగ2` అని పేరు పెట్టారు. ఇందులో అమలాపాల్ హీరోయిన్ గా నటించింది.
కథ నచ్చడంతో సూర్య తన సొంత ప్రొడక్షన్ కంపెనీ నుంచే ఈ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని తెలుగులో మేము పేరుతో విడుదల చేస్తున్నారు. మొదట్లో తమిళంలోనే విడుదల చేయాలనుకొన్నారు. కానీ సూర్య - అమలాపాల్ లకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే తెలుగులోనూ సినిమాని విడుదల చేస్తున్నారు. సూర్య ఈ సినిమాపై చాలా అంచనాలతో ఉన్నాడు. కలర్ ఫుల్ గా సాగే ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దలకీ నచ్చుతుందని నమ్మకంగా చెబుతున్నాడు. అలాంటి ఓసోషల్ ఎలిమెంట్ ఈ సినిమాలో ఉందట.
సూర్య ఇలాంటి విభిన్నమైన సినిమాలు చేసేందుకే టుడీ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఓన్ ప్రొడక్షన్ కంపెనీ స్థాపించాడు. ఆ ప్రొడక్షన్ కంపెనీలో తొలి ప్రయత్నంగా చేసిన 36 వయదినిలే ఘన విజయం సాధించింది. సూర్య భార్య జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ 36 వయదినిలేతోనే మొదలుపెట్టింది. ఆ సినిమా మంచి ఫలితాన్ని తీసుకురావడంతో సూర్య రెట్టించిన ఉత్సాహంతో పసంగ2 చేశాడు. ఇది కూడా విజయం సాధించిందంటే సూర్య మరిన్ని సినిమాలు నిర్మిస్తాడనడంలో సందేహం లేదు.