మహాభారతంలో కర్ణుడి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మంచికి చెడుకు అన్నింటికి కర్ణుడిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్నేహం కోసం.. ఇచ్చిన మాట కోసం ప్రాణానలు సైతం లెక్క చేయకుండా ధీరుడిగా నిలిచిన కర్ణుడు మహా భారతంలో ప్రధాన హీరోల్లో ఒకరు. అలాంటి కర్ణుడి పాత్రతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయినా కూడా తమిళంలో మరో సినిమాను కర్ణుడిపై తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూర్యపుత్ర మహావీర్ కర్ణ టైటిల్ తో పూజా ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కర్ణుడి పాత్రను చియాన్ విక్రమ్ చేయబోతున్నట్లుగా ఆ మద్య వార్తలు వచ్చయి. విక్రమ్ కూడా కర్ణ పాత్ర కోసం ఇతర సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంటున్నట్లుగా చెప్పాడు.
ప్రస్తుతం కోబ్రా సినిమాలో నటిస్తున్న విక్రమ్ తదుపరి సినిమా మహవీర్ కర్ణ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందబోతున్న ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. ఈ సినిమా షూటింగ్ కూడా ఆమద్య ప్రారంభం అయ్యి ఒకటి రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఇలాంటి సమయంలో సినిమా నుండి విక్రమ్ తప్పుకున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తాజాగా మహావీర్ కర్ణ సినిమా టీజర్ ను విడుదల చేశారు. అందులో విక్రమ్ కనిపించక పోవడంతో పాటు కనీసం కర్ణ పాత్రలో విక్రమ్ చేస్తున్నాడు అని కాని మెన్షన్ చేయలేదు. దాంతో ఈ సినిమా నుండి విక్రమ్ తప్పుకున్నాడేమో అంటూ అనుమానాలు వస్తున్నాయి. విక్రమ్ తప్పుకుంటే ఆ రేంజ్ క్రేజ్ ఉన్న హీరోను ఎప్పటి వరకు ఎంపిక చేస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వాలంటూ విక్రమ్ అభిమానులు కోరుకుంటున్నారు.