తమిళనాడు రాజకీయాల్లో సినిమా వారి చేరిక కొత్తే కాదు. ఎన్నో దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. ప్రస్తుతం తమిళ నాట రాజకీయాల్లో పలువురు సినీ ప్రముఖులు చక్రం తిప్పుతున్న విషయం తెల్సిందే. కమల్ హాసన్ ఇటీవలే పార్టీని స్థాపించగా - త్వరలోనే రజినీకాంత్ కూడా తమిళనాట రాజకీయాలు చేయబోతున్నాడు. విశాల్ మరియు ఇంకా పలువురు యంగ్ హీరోలు కూడా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో తమిళ స్టార్ హీరో అజిత్ మాత్రం రాజకీయాలపై ఆసక్తి లేనట్లుగా కనిపిస్తూ ఉంటాడు. ప్రస్తుత తమిళనాడు పరిస్థితులను చక్కదిద్దేందుకు అజిత్ రాజకీయాల్లోకి రావాలంటూ దర్శకుడు సుశీంద్రన్ కోరుతున్నాడు.
చాలా కాలం క్రితం జయలలితతో అజిత్ సన్నిహితంగా ఉండే వారు. దాంతో ఆమె రాజకీయ వారసుడిగా అజిత్ ను ప్రకటించే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేశాయి. అజిత్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఆయన్ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కాని అజిత్ మాత్రం సినిమాలపైనే ఆసక్తి చూపుతున్నాడు. కొన్ని రోజుల క్రితం కూడా తనకు రాజకీయాలు తెలియదు - రాజకీయాలపై ఆసక్తి లేదు అంటూ ముక్తసరి సమాధానం ఇచ్చాడు. ఇలాంటి సమయంలో సుశీంద్రన్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
40 ఏళ్లుగా తమిళ రాజకీయంలో ఎలాంటి మార్పు లేదు. తమిళ రాజకీయాల్లో - తమిళనాడు ప్రజల్లో మార్పు రావాలి అంటే అది నీ వల్లే సాధ్యం అవుతుంది - ప్రజల కోసం మీరు రాజకీయాల్లోకి రావాలి. మీకు ఇదే మంచి సమయం - మీరు రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు సంతోషిస్తారు అంటూ అజిత్ ను ఉద్దేశించి సుశీంద్రన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటి వరకు అభిమానులు మాత్రమే అజిత్ రాజకీయ రంగ ప్రవేశంను కోరుకున్నారు. ఇప్పుడు ఒక దర్శకుడు ఆ విషయమై మాట్లాడటం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. సుశీంద్రన్ పోస్ట్ కు అజిత్ ఎలా రియాక్ట్ అవుతాడనేది చూడాలి.