'నేను సరిగా ఆడలేదు' వైరల్ అవుతున్న సుశాంత్ లేఖ..

Update: 2021-01-14 00:30 GMT
దివంగత బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 14న ముంబైలోని తన ఇంట్లోనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ఘటన ఎన్నో అనుమానాలకు దారితీసింది. సినీ కెరీర్ పరంగా ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ ఇలా అర్దాంతరంగా సూసైడ్ చేసుకోవడం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోయారు. సుశాంత్ చనిపోయినపుడు అతని ఇంట్లో సూసైడ్ నోట్ లేకపోవడం.. పైగా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ ఘటన ఎన్నో చర్చలను లేవనెత్తింది. సుశాంత్ డెత్ మిస్టరీ పై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు ప్రచారం జరిగాయి. సుశాంత్ మానసికంగా చాలా కుంగిపోయాడని.. ఇంకా ఏవేవో అభిప్రాయాలతో పలువురు పలు విధాలుగా మాట్లాడుకున్నారు. అయితే తాజాగా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ ఓ లేఖను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఆ లేఖను సుశాంత్ సొంతంగా రాసి పెట్టుకున్నాడని చెప్పింది. ఇంతకీ ఆ లేఖలో సుశాంత్ ఏమని రాశాడంటే.. "నా జీవితంలో ఇప్పటికే ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఈ మొదటి 30 ఏళ్లను ప్రత్యేకంగా మలుచుకునేందుకు చాలా ప్రయత్నించాను. ఇందుకోసం నా ప్రతి పనిలో బెస్ట్ గా ఉండాలని కోరుకున్నాను. అలాగే టెన్నిస్‌, స్కూల్‌, చదువు, ర్యాంక్స్‌లో మొదటి స్థానంలో ఉండాలనుకున్నాను. అయితే ప్రతి కోణాన్ని అలా చూడటం వల్ల నేను అసంతృప్తికి లోనయ్యేవాడిని. నాకు మంచి జరిగినప్పుడు మాత్రం ఆట తప్పుగా ఆడానని గ్రహించాను. ఎందుకంటే నేనేంటో తెలుసుకోవడానికే ఆట ఉంది'’ అంటూ లోతైన అర్ధంతో రాసుకొచ్చాడు సుశాంత్. ప్రస్తుతం సుశాంత్ రాసిన ఈ లేఖ చాలామందిని కదిలిస్తోంది. అన్నట్లు సుశాంత్ చనిపోయి ఆల్రెడీ ఏడు నెలలు గడిచిపోయాయి. కానీ ఇంకా ఎవరు తనను మర్చిపోలేకపోతున్నారు.


Tags:    

Similar News