సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీపై దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ డొంకను కదిలించిన ఎన్.సి.బి-సీబీఐ బృందాలకు షాకిచ్చే నిజాలెన్నో తెలుస్తున్నాయి. వీటిపై జాతీయ మీడియా కథనాలు సంచలనంగా మారాయి. ఇప్పటికే పలువురు అగ్ర కథానాయికల్ని ఎన్.సి.బి విచారిస్తుండడంతో ఎలాంటి కఠోర నిజాలు వెలుగు చూస్తాయోనన్న ఉత్కంఠ అలానే ఉంది. మరో రెండు మూడు రోజుల్లోనే పలువురు అగ్ర కథానాయికల్ని ఎన్.సి.బి ప్రశ్నించనుంది.
ఇక అందరు నాయికలకు జయ సాహా లాంటి మేనేజర్ డీల్ సెట్టర్ కావడంతో సీబీఐ-ఎన్.సి.బికి సదరు టాలెంట్ మేనేజర్ సోర్స్ గా మారారు. ఆమె సుశాంత్ సింగ్ టాలెంట్ మేనేజర్ అన్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ ఇటీవలి కొన్ని ప్రాజెక్టుల(సినిమాలు)కు సంతకం చేయటానికి బాధ్యత వహించింది జయ సాహానే. పారితోషికం ఫైనల్ చేయడం సహా ప్రతిదీ తన చేతిలోనే ఉంది. ఇక మాదకద్రవ్యాల కుంభకోణం కేసులో ఎన్ .సి.బి జయ సాహాను విచారిస్తోంది.
ఈ విచారణలో జయ కొన్ని షాకింగ్ నిజాల్ని వెల్లడించారని తెలుస్తోంది. జూన్ 5 న సుశాంత్ తో మాట్లాడిన తరువాత అతన్ని ఆ తర్వాత కలిసినప్పుడు తనతో విచిత్రమైన రీతిలో ప్రవర్తించాడని అందరూ హైపర్ యాక్టివిటీతో ఒక గది నుంచి మరొక గదికి తిరిగామని.. జయ అధికారులకు చెప్పారు. రూ.6 కోట్ల చెల్లింపును ఆమె తనకు ఇచ్చినప్పుడు.. రెట్టింపు వేతనం కావాలని సుశాంత్ సీరియస్ అయ్యాడట. అటుపై జయా సాహా వెంటనే సుశాంత్ ఇంటిని విడిచిపెట్టి వెళ్లింది.
సుశాంత్ సింగ్ ఎందుకు ఇలా ప్రవర్తించాడు. అతను తన ప్రాణాన్ని ఎందుకు తీసుకున్నాడు? అన్నదానికి జయ తనకు ఎటువంటి క్లూ లేదని విచారణలో వెల్లడించారట. నిజానికి బాలీవుడ్ లో హీరోల్ని అదుపులో పెట్టుకుని వారితో డ్రగ్ ఆటలు ఆడించే పెద్దలు ఉన్నారని.. పారితోషికాలు కొందరి అదుపులోనే ఉంటాయని ఇదంతా పెద్ద మాఫియా గేమ్ అని.. దీనిపై లోతైన విచారణ చేయాలని పలువురు ఆరోపిస్తూనే ఉన్నారు. మరి ఈ కేసు విచారణలో అలాంటి నిజాలేవైనా బయటపడతాయా? అన్నది చూడాలి.