సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందుకు ఒకరోజు ముందు తన ప్రియురాలు రియా చక్రవర్తి షాడోని మీటయ్యిందట. ఇంతకీ ఎవరా షాడో? అన్నది ఆరా తీస్తోంది సీబీఐ.
షాడో ఎవరో తెలియాలంటే ఐ విట్ నెస్ చాలా ఇంపార్టెంట్. అందుకే సీబీఐ అందుకు రంగం సిద్ధం చేస్తోంది. 19 ఆగస్టు 2020 నుండి సిబిఐ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును విచారిస్తోంది. అధికారులు దీనికి సంబంధించి మరో సాక్షిని పిలవడానికి సిద్ధంగా ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 13 న రియా చక్రవర్తిని కలిసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసినదే. అయితే ఆ ఇద్దరూ కలుసుకున్నారనేది నిజమా? ఎవరైనా స్వయంగా చూశారా? ఐ విట్ నెస్ వెతకడం ఎలా? సాక్షిని పిలవడానికి సిబిఐ శతవిధాలా ప్రయత్నిస్తోందట.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ప్రతి రోజు గడిచేకొద్దీ డర్టీగా మారుతోందే కానీ ఓ కొలిక్కి రావడం లేదు. ఇన్ని గొడవల మధ్యలో బిజెపి ముంబై కార్యదర్శి న్యాయవాది వివేకానంద్ గుప్తా చేసిన షాకింగ్ కామెంట్లు సంచలనమే అయ్యాయి. జూన్ 8 న రియా చక్రవర్తి దివంగత నటుడి నివాసం నుండి బయలుదేరింది అన్నది నిజం కాదంటూ.. అందుకు విరుద్ధంగా వారిద్దరూ జూన్ 13 న కలుసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది సుశాంత్ మరణానికి ఒక రోజు ముందు. రియా స్వయంగా హాజరైన పార్టీ గురించి గుప్తా ప్రస్తావించారు.
దీనిపై రిపబ్లిక్ టివి నివేదిక వెలువడింది. దాని ప్రకారం జూన్ 13 న సుశాంత్ స్వయంగా రియాను ఉదయం 6-6.30 గంటలకు తనే స్వయంగా ఓచోట దిగబెట్టాడు అనడానికి సాక్షి ఉన్నాడు అని రిపబ్లిక్ టీవీ కథనం వేయడం సంచలనమైంది. సుశాంత్ స్వయంగా కారు నడిపాడట. ఆ తేదీన ఇద్దరూ కలవడాన్ని చూసిన సాక్షిని సిబిఐ పిలుస్తుందనేది సదరు జాతీయ మీడియా కథనం.
జూన్ 14 న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుండి అనేక ఊహాగానాలు.. చర్చలు.. వివాదాలు తలెత్తాయి. మరోవైపు, రియా చక్రవర్తి షోయిక్ బెయిల్ పిటిషన్లపై బొంబాయి హైకోర్టు నేడు (బుధవారం) తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. అయితే ప్రత్యేక ఎన్డిపిఎస్ కోర్టు వారి కస్టడీని 2020 అక్టోబర్ 20 వరకు పొడిగించింది.
మరోవైపు సుశాంత్ కుటుంబం దర్యాప్తులో జోక్యం చేసుకుందని.. ఎయిమ్స్ వైద్యులపై ఒత్తిడి తెచ్చిందని రియా న్యాయవాది సతీష్ మనేషిందే ఆరోపించారు. అంతేకాకుండా.. దివంగత నటుడి సోదరీమణులు మీతు మరియు ప్రియాంక సింగ్ కూడా మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఫోర్జరీ ఆరోపణలపై రియా దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ను రద్దు చేసినందుకు బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఇన్ని ట్విస్టుల నడుమ జూన్ 13వ తేదీ ఇన్సిడెంట్ సీబీఐకి ఎలాంటి క్లూ ఇవ్వనుందో చూడాలన్న ఆసక్తి నెటిజనుల్లో ఉంది.