#సుశాంత్ కేసు.. ఏదీ మీడియాకు లీకులివ్వ‌‌క‌పోవ‌డానికి కార‌ణం?

Update: 2020-10-25 17:52 GMT
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్ప‌ద మృతికి సంబంధించిన కేసుని ప్రస్తుతం మూడు వేర్వేరు ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నవిష‌యం తెలిసిందే. అయితే ఈ మూడు ఏజెన్సీలు ఈ కేసుకి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం ఇవ్వలేదు. ఈ కేసుకు సంబంధించి మీడియాకు ఎటువంటి సమాచారం లీక్ చేయలేదని ఇటీవల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ),... నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి),... ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బాంబే హైకోర్టుకు సమాచారం ఇచ్చాయి. ఏజెన్సీల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ బొంబాయి హైకోర్టుకు తాజాగా సమాచారం ఇచ్చారు.

ఈ కేసులో మీడియా విచారణకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిల్స్ ‌ను కోర్టు విచారించినట్లు సమాచారం. `మా బాధ్యతలు మాకు తెలుసు.. ఏ ఏజెన్సీల ద్వారా సమాచారాన్ని లీక్ చేసే ప్రశ్న లేదు` అని అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ స్ప‌ష్టం చేశారు. సుశాంత్ మృతికి సంబంధించిన కేసుని సిబిఐ దర్యాప్తు చేస్తుండగా, మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఇడిని రంగంలోకి దింపారు. ఎన్‌.సిబి విషయానికొస్తే మాద‌క ద్ర‌వ్యాల వాడ‌కంపై రియా వాట్సాప్ చాట్ బ‌య‌ట‌ప‌డ‌టంతో ఎన్సీబీని రంగంలోకి దింపాల్సి వ‌చ్చింది.  

సుశాంత్ సింగ్ రాజ్ ‌పుత్ కేసులో మీడియా విచారణ గురించి ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. దీనిపై న్యాయ‌మూర్తులు స్పందించారు. ఈ కేసు విష‌యంలో మీడియాని నియంత్రించాల‌న్న‌ది ప్ర‌శ్న కాదు. సుశాంత్ అకౌంట్ ల‌కి సంబంధించిన చెక్స్ అండ్ బ్యాలెన్స్ గురించి చ‌ర్చించాలి. ఈ కేసు ఎలా ఎటు తిరుగుతుంద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌లు మ‌ర్చిపోయే ప్ర‌మాదం వుంది. కాబట్టి ఈ వారం విచారణ తిరిగి ప్రారంభించ‌బోతున్నాం` అన్నారు.

సుశాంత్ మృతి కేసు విష‌యంలో విచార‌ణ చేప‌‌ట్టిన మూడు ఏజెన్సీలలో మాదకద్రవ్యాల కేసు పెద్ద కేసుగా మారింది. ఎందుకంటే ఈ కేసు మొద‌లైన త‌రువాత అత్య‌ధిక అరెస్ట్ లు మాదకద్రవ్యాల డీలర్ల విష‌యంలో అరెస్టులు జ‌రిగాయి. డ్ర‌గ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు స‌మ‌న్లు జారీ చేసి మ‌రీ వారిని విచారించిన విష‌యం తెలిసిందే.  ఈ జాబితాలో దీపికా పదుకొనే,.. సారా అలీ ఖాన్, .. శ్రద్ధా కపూర్,... లను విచారించారు. ఒక సాక్ష్యం కోసం ర‌కుల్ త‌న‌ని పిలిచార‌ని ఇంత‌కుముందు వెల్ల‌డైంది.
Tags:    

Similar News