బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు యావత్ సినీ లోకాన్ని షాక్ కి గురి చేసింది. ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్ ఉందని భావించిన సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకొని ఇలా అర్థాంతరంగా తనువు చలించడంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. అనేక పరిణామాల తర్వాత సుశాంత్ కేసుని అనుమానాస్పద మృతిగా భవిస్తూ సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇదే క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందిరాలుగా ఉన్న సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తి ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసింది. బెయిల్ పై విడుదలైన రియా.. సుశాంత్ సింగ్ మృతికి ఆయన సోదరీమణులు ఇచ్చిన మెడిసిన్స్ కూడా కారణమై ఉండవచ్చని మరో కొత్త సందేహాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక స్థితి బాగాలేదంటూ ఆయన సోదరీమణులు ప్రియాంకా సింగ్ - మీతూ సింగ్ సూచించిన మందులు కూడా మృతికి కారణమై ఉండవచ్చని రియా చక్రవర్తి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియాంక - మీతూ సింగ్ వాట్సాప్ ద్వారా 3 రకాల మందుల పేర్లను పంపారని.. అయితే డాక్టర్లు పరీక్షించకుండానే ఇచ్చిన ఆ మందులు సుశాంత్ ని ఆత్మహత్య చేసుకునేలా ప్రభావం చూపి ఉంటాయని రియా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి సుశాంత్ కు ఆయన సోదరీమణులకు మధ్య జరిగిన వాట్సాప్ మెసేజ్ లను ఆమె పోలీసులకు సమర్పించిందని తెలుస్తోంది. అయితే ప్రియాంకాసింగ్ - మీతూసింగ్ లపై కేసు పెట్టడాన్ని సీబీఐ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో అఫిడవిట్ దాఖలు చేసిన ముంబై పోలీసులు 'సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి ఆరోపణలకు సంబంధించిన కొన్ని ఆధారాలను సమర్పించిందని.. ఆ మేరకే తాము కేసు నమోదు చేశామ'ని బాంబే హైకోర్టుకు తెలిపారు.