సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై దర్యాప్తు కేసును 145 రోజుల తరువాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో తుది రిపోర్టును బహిర్గతం చేయాల్సిందిగా పలువురు రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో తాజాగా సీబీఐ స్పందించింది. ఈ కేసులోని అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని.. పరిశోధన ఇంకా కొనసాగుతోందని.. ఏదీ తోసిపుచ్చలేదని చెప్పారు.
అక్టోబరులో దిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం సిబిఐకి తన రిపోర్టును అందించింది. సుశాంత్ ని హత్య చేయలేదని ఇది ఆత్మహత్య కేసు అని సీబీఐకి వెల్లడించింది. సుశాంత్ ఫ్యామిలీ లాయర్ చెప్పినట్టు విషం ఇచ్చి గొంతు పిసికి చంపారన్న సిద్ధాంతాలను తోసిపుచ్చారు.
దర్యాప్తు స్థితి గురించి బిజెపి ఎంపి సుబ్రమణియన్ స్వామి ప్రధానమంత్రి కార్యాలయానికి (పిఎంఓ) లేఖ రాశారు. ఆ తర్వాత పిఎంఓ ఈ లేఖను సిబిఐకి పంపారు.
మిస్టర్ స్వామికి ఇచ్చిన సమాధానంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక మాట చెప్పింది. ``సిబిఐ తాజా శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి సమగ్రంగా వృత్తిపరంగా దర్యాప్తు నిర్వహిస్తోంది. దర్యాప్తులో అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికి ఏ అంశాన్ని తోసిపుచ్చలేదు`` అని వెల్లడించారు.
``దర్యాప్తులో డిజిటల్ పరికరాల్లో లభ్యమయ్యే సంబంధిత డేటాను వెలికితీసేందుకు విశ్లేషించడానికి కేసుకు సంబంధించిన సంబంధిత సెల్ టవర్ స్థానాల డంప్ డేటాను విశ్లేషించడానికి తాజా సాఫ్ట్ వేర్ తో సహా ఆధునిక మొబైల్ ఫోరెన్సిక్ పరికరాలు ఉపయోగించబడ్డాయి`` అని సిబిఐ తెలిపింది.
``దర్యాప్తులో ఫిర్యాదుదారుడు అతని కుటుంబ సభ్యులు ఇతర స్వతంత్ర ఫిర్యాదీలు లేవనెత్తిన పరిస్థితులు భయాలను అర్థం చేసుకోవడానికి సాక్షులందరినీ పరిశీలించారు. ఈ విషయంలో తీవ్రమైన సమగ్రమైన దర్యాప్తు జరిగింది`` అని సిబిఐ తెలిపింది. అలీఘర్- ఫరీదాబాద్ - హైదరాబాద్ - ముంబై- మనేసర్ - పాట్నా వంటి అన్ని ప్రదేశాలను దర్యాప్తు బృందం సందర్శించిందని సీబీఐ తెలిపింది.