యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలిన చందంగా.. ఈ కేసుతో ముడిపడిన బాలీవుడ్ డ్రగ్స్ డొంక మొత్తం ఎన్.సి.బి చేతికి చిక్కింది. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసును సంపూర్ణంగా దర్యాప్తు చేసి 12000 పేజీల ఛార్జ్ షీట్ ను ఎన్.సి.బి తయారు చేసింది. ఇందులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి .. ఆమె సోదరుడు షోయిక్ .. పలువురు మేనేజర్లు సహా 33 పేర్లను జాబితాలో చేర్చింది ఏజెన్సీ.
ఈ కేసుకు సంబంధించి 200 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకొని ఎన్‌సిబి 50వేల పేజీలను డిజిటల్ ఆకృతిలో సేకరించింది. సుశాంత్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరాండా.. సుశాంత్ ఇంటి సహాయకుడు దీపేశ్ సావంత్- డ్రగ్ పెడ్లర్ అనుజ్ కేశ్వని- ధర్మ ప్రొడక్షన్స్ తో సంబంధం ఉన్న మాజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ ప్రసాద్- అర్జున్ రాంపాల్ సతీమణి సోదరుడు అగిసిలాస్ డెమెట్రియేడ్స్ తో సహా ఇద్దరు విదేశీ పౌరులు.. ఆఫ్రికన్ మోడల్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ వీళ్లంతా చార్జిషీట్ లో చేరారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే.. శ్రద్ధా కపూర్ సహా యువనాయిక సారా అలీ ఖాన్ వాంగ్మూలాలు సేకరించిన ఎన్.సి.బి నిందితుల జాబితాలో వీరిని చేర్చకుండా వదిలేయడం విశేషం.
ఇది ఇప్పటికి మొదటి ప్రధాన చార్జిషీట్. తుదిగా నేరస్తులు ఎవరు? సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణాలేమిటి? అన్నది తేలాల్సి ఉంటుంది. రకరకాల కారణాల వల్ల కేసు ఆలస్యం అవుతోంది. ప్రతిరోజూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు మద్దతుదారులు అతని ఆత్మహత్యకు న్యాయం చేయాలని డ్రగ్స్ యాంగిల్ ను కోరుతూ సోషల్ మీడియాలో పాల్గొంటారు. గత ఏడాది జూన్ లో బాంద్రాలోని తన అద్దె డ్యూప్లెక్స్ ఫ్లాట్ లో సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డారని నివేదికలు వెల్లడించాయి. అయితే దీనివెనక డ్రగ్స్ కోణంతో పాటు బాలీవుడ్ మాఫియా కుట్రలు ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. ఎన్.సి.బి ఛార్జ్ షీట్ అనంతరం సీబీఐ అంతిమంగా ఏం నిర్ణయించిందనేది చూడాలి.