బాలీవుడ్ ఇండస్ట్రీ టాలెంటెడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ముంబైలోని తన నివాసంలో ఆదివారం ఉరి వేసుకొని సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతనిది ఆత్మహత్య కాదని.. హత్య చేశారని ఈ మరణం వెనుక ఏదో కుట్ర దాగివుందని సుశాంత్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవలే బయటకొచ్చిన సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం పోలీసులు జరిగిన విషయాన్ని బయట పెట్టారు. సుశాంత్ ఆత్మహత్యే చేసుకున్నాడని.. ఇంట్లోని ఫ్యాన్‌కి ఉరి వేసుకొని సూసైడ్ కి పాల్పడ్డాడని.. ఇది హత్య కాదని తేల్చి చెప్పారు.
ముంబైలోని జూహూ ప్రాంతంలో ఉన్న కూపర్ హాస్పిటల్‌లో సుశాంత్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. డెడ్ బాడీకి కరోనా పరీక్షలు సైతం చేసి నెగెటివ్ అని నిర్దారించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్‌ని సోమవారం ఉదయం మీడియా ముందుంచారు. ఈ రిపోర్ట్ ప్రకారం సుశాంత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని.. ప్రకటించిన పోలీసులు నిన్ననే అంత్యక్రియలు జరపడానికి సహకరించారట. ఇక సుశాంత్ గత ఆరు నెలలుగా డిప్రెషన్‌లో ఉండి ఒత్తిడి భరించలేక ప్రాణాలు తీసుకున్నారని ముంబై పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. సుశాంత్ మేనేజర్ దిశా సైతం వారం క్రితమే సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరో వైపు 34 యేళ్ల వయసులోనే సుశాంత్ జీవితం ముగియడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేక పోతున్నారు. టాలెంటెడ్ యాక్టర్ డెత్ తమను తీవ్రంగా కలచివేసిందంటూ పలువురు సినీ ప్రముఖులు తెలిపి సంతాపం వ్యక్తం చేశారు.