సుశాంత్ కేసు క్లోజ్‌.. ఏం తేల్చారు?

Update: 2020-07-13 17:00 GMT
బాలీవుడ్ యువ న‌టుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి అప్పుడే నెల రోజులు కావ‌స్తోంది. దీని తాలూకు విషాదం నుంచి అభిమానులు ఇంకా కోలుకోలేదు. అత‌డి ఆత్మ‌హ‌త్య విష‌యంలో అనేక అనుమానాలు వ్య‌క్తం చేశారు. బాలీవుడ్లో ఓ వ‌ర్గం మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఐతే ఈ కేసును విచారించిన పోలీసులు మాత్రం సుశాంత్ ఆత్మ‌హ‌త్య విష‌యంలో త‌లెత్తిన ఆరోప‌ణ‌ల‌కు ఎలాంటి ఆధారాలు దొర‌క‌లేద‌ని తేల్చిన‌ట్లు స‌మాచారం. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన రోజు నుంచే పోలీసుల విచార‌ణ మొద‌లైంది. సుశాంత్ గ‌ర్ల్ ప్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి స‌హా ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను పోలీసులు విచారించారు. సుశాంత్ కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. అత‌డి గ‌దిలో అన్ని వ‌స్తువుల‌నూ స్వాధీన‌ప‌రుచుకుని ప‌రిశీలించారు.

ఈ కేసులో దాదాపు 35 మందికిపైగా వ్యక్తులను పోలీసులు ప్ర‌శ్నించిన‌లు స‌మాచారం. అలాగే ఫోరెన్సిక్ నిపుణుల నుంచి కూడా స‌మాచారం సేక‌రించారు. ఐదుగురితో కూడిన‌ బృందం ఈ విచార‌ణ చేప‌ట్టింది. ఈ ప్ర‌క్రియ దాదాపుగా ముగిసింద‌ని.. ప్ర‌స్తుతం నివేదిక రూపొందిస్తున్నార‌ని స‌మాచారం. తుది నివేదికను ఇంకో వారం ప‌ది రోజుల్లో ఉన్న‌తాధికారుల‌కు అప్ప‌గిస్తార‌ట‌. ఐతే ఈ కేసులో సంచలన సాక్ష్యాలు, విషయాలేవీ బయటకు రాలేదని.. సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్యా లేదాసహజ మరణమా.. లేక ఇందులో వేరొక‌రి ప్ర‌మేయం ఉందా అనే అంశాల‌పై ఫోరెన్సిక్ నిపుణులతోనూ మాట్లాడామ‌ని... అన్ని విష‌యాల‌పై స‌మ‌గ్ర నివేదికను రూపొందిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. సంచ‌ల‌న సాక్ష్యాలు, విష‌యాలు ఏవీ బ‌య‌టికి రాలేద‌ని చెప్ప‌డం ద్వారా ఈ కేసును త్వ‌ర‌లోనే క్లోజ్ చేసేయ‌బోతున్న‌ట్లు పోలీసులు ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చిన‌ట్లే అని భావిస్తున్నారు. ఐతే స్థానిక పోలీసులు కేసును నీరుగార్చేస్తున్నార‌ని.. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని అత‌డి అభిమానులు, మ‌ద్ద‌తుదారులు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News