బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో బీహార్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తమ రాష్ట్రానికే చెందిన సుశాంత్ ముంబైలో చనిపోవడంతో బీహార్ పోలీసుల ప్రత్యేక పోలీస్ బృందం ముంబైకి వెళ్లిందని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే తెలిపారు. పోలీసులు సుశాంత్ మృతికి సంబంధించిన పలు కీలక ఆధారాలను సేకరిస్తున్నారని తెలిపారు.
సుశాంత్ స్నేహితులు.. సహచరులు.. బంధువులను విచారించి హత్యకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే సుశాంత్ కేసులో పలువురి వాంగ్మూలాలను బీహార్ పోలీసులు సేకరించారు.
అయితే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఎక్కడ ఉన్నారో ఇంకా గుర్తించలేదని.. ఆమె ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదని బీహార్ పోలీసులు తెలిపారు. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు అతడి బ్యాంక్ అకౌంట్లోని 15 కోట్ల రూపాయలను రియా మాయం చేసిందనే ఫిర్యాదుపై బీహార్ పోలీసులు విచారణ జరిపారు. బ్యాంక్ అకౌంట్, ట్రాన్స్ సాక్షన్స్ బ్యాంకు నుంచి తీసుకున్నారని బీహార్ డీజీపీ తెలిపారు.
ఇక సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కనిపించడం లేదు. ఆమె జాడ లేదు. దీంతోపాటు బీహార్ పోలీసుల నుంచి ఈ కేసును ముంబై పోలీసులకు అప్పగించాలని రియా సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది.