మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుశ్మిత కొణిదెల గురించి పరిచయం అవసరం లేదు. ఇప్పటికే మెగా బాస్ సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ కం కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు. ఖైదీనంబర్ 150 .. సైరా నరసింహారెడ్డి చిత్రాలకు కాస్ట్యూమ్స్ అందించింది సుశ్మితనే. బాస్ కంబ్యాక్ సినిమాతో పాటు ప్రతిష్ఠాత్మక `సైరా`కు అద్భుతమైన కాస్ట్యూమ్స్ ని.. స్టైలింగ్ ని డిజైన్ చేయడంలో సుశ్మిత పనితనానికి ప్రశంసలు దక్కాయి.
అయితే సుశ్మిత ప్రస్థానం కేవలం కాస్ట్యూమ్స్ వరకేనా? అంటే .. మునుముందు పలు శాఖల్లో ప్రతిభను చూపేందుకు సన్నాహకాల్లో ఉన్నారట. ఇప్పటికే ఓ తెలుగు వెబ్ సిరీస్ ని నిర్మించేందుకు సుశ్మిత సన్నాహాల్లో ఉన్నారు. అందుకు ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజంతో ఒప్పందం కుదిరిందని ...నిర్మాతగానూ సుశ్మిత సత్తా చాటే ఆలోచనల్లో ఉన్నారని రివీలైంది.
సినీరంగంలో తన కెరీర్ రూపు దిద్దుకుంటున్న తీరుపై సుశ్మిత చాలా సంతోషంగానే ఉన్నారు. రకరకాల విభాగాల్లో ప్రాక్టికల్ గా అనుభవం ఘడించారు కాబట్టి అది సినీనిర్మాతగా ఎదిగేందుకు అక్కరకొస్తుందనడంలో సందేహం లేదు. మునుముందు సోదరుడు రామ్ చరణ్ కి కొణిదెల బ్యానర్ కి తనో పెద్ద అండ అనడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. అన్నట్టు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సొంతంగా ఓటీటీ వేదికను రెడీ చేసి వరుసగా వెబ్ సిరీస్ ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. కొణిదెల కాంపౌండ్ అలాంటి ప్రణాళికల్లో ఉందా లేదా? అన్నదానిపై సరైన సమాచారం తెలియాల్సి ఉంది.