ప్రపంచ సుందరి 15 ఏళ్ల పోరాటంలో విజయం

Update: 2018-11-21 13:30 GMT
మాజీ ప్రపంచ సుందరి సుష్మిత సేన్‌ ను 15 ఏళ్ల క్రితం కోకోకోలా కంపెనీకి చెందిన ఉన్నత ఉద్యోగి లైంగికంగా వేదించాడు. అప్పట్లో కోకోకోలాకు సుష్మిత బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించేది. ఆసమయలోనే ఆమెతో ఆ సంస్థ ఉద్యోగి చెడుగా ప్రవర్తించాడట. దాంతో అప్పట్లోనో సుష్మిత సేన్‌ కోర్టుకు వెళ్లింది. సుష్మిత సేన్‌ అప్పటి నుండి కూడా కోర్టులో ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. తాజాగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సుష్మిత చేసిన ఆరోపణలు నిరూపితం అవ్వడంతో కోకోకోలా కంపెనీ ఆమెకు 1.45 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. న్యాయపోరాటంలో గెలిచి నష్టపరిహారం దక్కించుకున్న సుష్మిత సేన్‌ నుండి 50 లక్షల రూపాయల ఆదాయపు పన్నును వసూళ్లు చేసేందుకు ఐటీ శాఖ ప్రయత్నం చేసింది. కాని నష్టపరిహారంగా వచ్చిన అమౌంట్‌ కు ఐటీ రిటర్న్‌ కట్టేది లేదు అంటూ మళ్లీ సుష్మిత సేన్‌ కోర్టును ఆశ్రయించింది.

సుష్మిత సేన్‌ ఐటీ శాఖపై కోర్టులో తాజాగా గెలిచింది. నష్టపరిహారంగా వచ్చిన డబ్బుకు ఐటీ కట్టాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పడంతో ఆమె గెలుపొందినట్లయ్యింది. పన్ను కట్టక పోగా ఐటీ శాఖ నుండి ఆమెకు మరో 35 లక్షల ఫెనాల్టీ కూడా దక్కింది. 2003వ సంవత్సరంలో ప్రారంభం అయిన ఈ కేసు ఎట్టకేలకు ముగిసింది. పలు రకాలుగా ఈ కేసును విచారించిన కోర్టు చివరకు సుష్మిత సేన్‌ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. నష్ట పరిహారం విషయంలో కూడా కోర్టు ఆమెకే మద్దతుగా నిలవడం చర్చనీయాంశం అయ్యింది. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సుష్మితా సేన్‌ ప్రస్తుతం తనకంటే వయస్సులో చాలా చిన్నవాడు అయిన ఒక మోడల్‌ కుర్రాడితో ప్రేమలో ఉంది. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది.

Tags:    

Similar News