తన అందంతో విశ్వ విజేతగా నిలిచిన భామ సుస్మితాసేన్. అందాల పోటీలో అదిరిపోయేలా తన ప్రతిభను ప్రదర్శించిన ఆమె.. తర్వాతి కాలంలో బాలీవుడ్.. టాలీవుడ్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది మనసుల్ని కొల్లగొట్టారు. తన అందచందాలతో పాటు.. తన వ్యక్తిత్వంతో ఎంతోమందిని తనకు అభిమానులుగా చేసుకున్న సుస్మితా తాజాగా తనకు ఎదురైన షాకింగ్ ఉదంతాన్ని వెల్లడించారు.
ముంబయిలోని మేక్ యార్ సిటీ సేఫ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన సుస్మిత.. ఆర్నెల్ల క్రితం తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని వెల్లడించారు. తానో అవార్డుల ఫంక్షన్ కు వెళ్లగా తనను వెనుక నుంచి పట్టుకున్నాడని... మిస్ బిహేవ్ చేశాడని చెప్పారు. తనను గుర్తించలేనని అనుకున్నాడు. కానీ.. వెనుక నుంచి అతని చేతిని పట్టుకున్నాను. అతన్నిచూసి షాక్ తిన్నాను. ఎందుకంటే అతడికి 15 ఏళ్లు ఉంటాయేమో. ఆ తర్వాత అతని మెడ పట్టుకొని కొంతదూరం లాక్కెళ్లినట్లు చెప్పారు.
తాను గట్టిగా అరిచి అల్లరి చేస్తే.. నీ కెరీర్ ఏమవుతుందో తెలుసా? అని ప్రశ్నించానని.. మొదట తాను చేసిన తప్పును ఒప్పుకోలేదని.. కానీ ఆ తర్వాత ఒప్పుకొని ఇంకెప్పుడూ అలా చేయనని మాటిచ్చినట్లు చెప్పారు. అతనిపై తాను ఎలాంటి చర్యా తీసుకోలేదన్నారు. అయితే.. ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదని ఆమె చెప్పటం గమనార్హం.