సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లింగ అట్టర్ ఫ్లాపైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో రజనీ సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. అనుష్క - సోనాక్షి సిన్హా నాయికలుగా ఆడిపాడారు. అయితే ఆ తర్వాత రజనీ కాస్త గ్యాప్ తీసుకుని ఓ రెండు కథల్ని ఎంపిక చేసుకున్నారు. అందులో ఒకటి కబాలి, రెండోది రోబో2. ప్రస్తుతం పి.ఎ.రంజిత్ దర్శకత్వంలో కబాలి చిత్రీకరణలో ఉంది. ఇందులో రాధికా ఆప్టే ఓ కథానాయిక. రెండో నాయిక ఎవరన్నది తెలియాల్సి ఉందింకా.
అలాగే స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న రోబో 2లో ఎమీ జాక్సన్ ఓ కథానాయికగా ఎంపికైంది. రెండో నాయిక కోసం వేట సాగిస్తున్నారని సమాచారం. అయితే ఈ రెండో నాయిక అవకాశం ఎవరిని వరిస్తుంది? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలే శంకర్ రోబో 2 చిత్రాన్ని జాతీయ ప్రాజెక్టుగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో బాహుబలి రికార్డుల్ని కొట్టేయాలన్న తపనతో చేస్తున్నాడు. అలాంటప్పుడు తెలుగు - తమిళ రెజియనల్ హీరోయిన్స్ అయితే సరిపోరని భావించాడేమో .. ఇప్పటికే లండన్ బ్యూటీ ఎమీజాక్సన్ కి ఛాన్సిచ్చాడు.
దాంతో పాటు రెండో నాయికగా ఓ జాతీయ స్థాయి హీరోయిన్ కి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంటే జాతీయ స్థాయి నటి అంటే కరీనకపూర్ - కత్రిన - విద్యాబాలన్ - కంగన రనౌత్ లాంటి నాయికల్ని రజనీ సరసన ఎంపిక చేస్తారా? లేక ఇప్పటికే సోగ దేహంతో తిరిగి పాత రూపాన్ని సంతరించుకున్న ఐశ్వర్యారాయ్ నే ఎంపిక చేసుకుంటారా? అన్నది వేచి చూడాల్సిందే.