బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ ఇప్పుడో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. గోవాకు చెందిన ఓ రియాల్టీ సంస్థ ఈమెపై ఓ కేసు నమోదు చేసింది. తమను 1.87 కోట్ల రూపాయలకు సుసానే మోసం చేసిందన్నది ఆ కంపెనీ వాదన.
అయితే.. ఈ కేసు విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు సుసానే ప్రయత్నించింది. 'నేను ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్ ని కాదని, వారిని మోసం చేశానని ఎంజీ ప్రాపర్టీస్ ఆరోపిస్తోంది. అయితే.. ఇది వారిపై నేను ఆర్బిట్రేషన్ కేసు వేయడంతో.. దానిని పక్కదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారు. నన్ను అర్ధాంతరంగా కాంట్రాక్టు నుంచి తప్పించడంపై నేను ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కు వెళ్లాను. నన్ను మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నించేందుకే.. ఈ చీటింగ్ కేసును నాపై నమోదు చేశారు' అని సుసానే ఖాన్ చెప్పుకొచ్చింది.
ఇలాంటి బెదిరింపులతో తనను ఏం చేయలేరని అంటున్న సుసానే ఖాన్.. దీనికి న్యాయపరమైన పరిష్కారం వెతుకుతున్నామని అంటోంది. తన పరువుకు నష్టం కలిగించిన ఆ కంపెనీపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతోందిట.