కిరణ్ అబ్బవరం హీరోగా 'ఎస్.ఆర్. కల్యాణ మండపం' సినిమా రూపొందింది. ప్రమోద్ - రాజు నిర్మించిన ఈ సినిమాకి,శ్రీధర్ దర్శకత్వం వహించాడు. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన బాణీలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సాయికుమార్ .. తులసి కీలకమైన పాత్రలను పోషించారు. ఈ నెల 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
రాజశేఖర్ .. జీవిత .. ఎస్వీ కృష్ణారెడ్డి .. అచ్చిరెడ్డి .. అల్లరి నరేశ్ .. కార్తికేయ .. తరుణ్ భాస్కర్ .. తేజ సజ్జా ఈ వేడుకకు హాజరయ్యారు. రాజశేఖర్ చేతుల మీదుగా అల్లరి నరేశ్ ఫస్ట్ టికెట్ ను అందుకున్నారు. ఈ వేదికపై ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ .. "నిర్మాతలు ప్రమోద్ గారు .. రాజు గారు 'ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై ఒక అద్భుతమైన సినిమాను తీశారనే అనిపిస్తోంది. దర్శకుడు శ్రీధర్ గారు విపరీతంగా కష్టపడ్డాడని తెలుస్తోంది. ట్రైలర్ చూసిన తరువాత .. హీరో కిరణ్ బ్రహ్మాండంగా చేశాడనే అనిపించింది.
ఇక సాయికుమార్ గురించి చెప్పనవసరమే లేదు. ఈ సినిమలో సంథింగ్ డిఫరెంట్ గా ఆయన యాక్ట్ చేశాడని చెప్పొచ్చు. రొటీన్ కి భిన్నంగా డాన్స్ చేశాడు .. డైలాగ్ చెప్పడంలో కొత్త ప్రయోగమేదో చేశాడు. మొత్తానికి ఏదో మేజిక్ చేయడానికి తపన పడ్డాడు. అంటే వీరందరినీ చూస్తుంటే ఒక సెన్సేషనల్ సినిమా చేయాలనే పట్టుదలతో ముందుకు వెళ్లినట్టుగా నాకు అనిపిస్తోంది. డిఫినెట్ గా చెబుతున్నాను .. ఈ బ్యాచ్ చిన్నది కాదు. ఈ బ్యానర్ ఎదుగుతుంది .. పెద్దదవుతుంది .. ఎన్నో హిట్ సినిమాలు ఇస్తుంది. వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది.
చైతన్ భరద్వాజ్ బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి పాటను సూపర్ హి చేయడానికి తపన పడ్డాడు. ముఖ్యంగా ఒక పాట అద్భుతంగా వచ్చిందని విన్నాను. ఈ సినిమా టీమ్ కసి .. కృషి ... పట్టుదల నాకు బాగా నచ్చాయి. వాళ్ల అంకితభావం వాళ్లను ఎక్కడో కూర్చోబెడుతుంది. మంచి సినిమాలు తీయడమంటే మాటలు కాదు ఈ రోజుల్లో. వీరంతా ఈ సినిమాను తపించి చేశారు .. శ్రమించి చేశారు .. చెమటోడ్చి చేశారు. ఈ సమయంలో కూడా ఈ సినిమాకు ఇంత అందంగా ప్రమోట్ చేస్తున్నారంటే, ఈ సినిమా టీమ్ ను ఎంత మెచ్చుకోవాలి?
ఈ సినిమా గురించి బయట చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు. చాలా తక్కువ సినిమాలకు ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి .. ఈ ప్రమోషన్స్ కి అన్ని వైపుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందువలన ఇక ఈ సినిమా సూపర్ .. డూపర్ హిట్ కావడం ఖాయం" అంటూ చెప్పుకొచ్చారు.