బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే కొన్నాళ్ల క్రితం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కు వ్యతిరేకంగా దిల్లీ జేఎన్ యూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేసింది. ఆ సమయంలో జేఎన్ యూకు వెళ్లి మరీ దీపిక వారికి మద్దతు తెలపడంపై సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని దీపిక అంతగా వ్యతిరేకించడంపై రాజకీయ వర్గాల్లో కూడా దుమారం రేగింది. అప్పటి నుండి కూడా దీపికపై కొన్ని రాజకీయ సంఘాలు మరియు కొందరు నాయకులు దీపిక 5 కోట్ల రూపాయలు తీసుకుని సీఏఏ వ్యతిరేక పోరాటంకు మద్దతు తెలిపింది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.
తాజాగా హీరోయిన్ స్వరా భాస్కర్ ఆ విషయమై స్పందిస్తూ ఆ వాదన పూర్తిగా అవాస్తవం అంది. సినిమా స్టార్స్ గురించి మరీ ఇంత చెత్తగా మాట్లాడుతారు అంటూ ప్రశ్నించింది. సినిమా వాళ్లు అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా మీకు అంటూ అసహనం వ్యక్తం చేసింది. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై ఒక నెటిజన్ స్పందిస్తూ రెండు నిమిషాల పాటు జేఎన్ యూ లో దీపిక ఉన్నందుకు అయిదు కోట్లు తీసుకుంది. నువ్వు ఏడాదిగా సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం చేస్తు ఒక సీ గ్రేడ్ వెబ్ సిరీస్ లో ఛాన్స్ దక్కించుకున్నావు అంటూ కామెంట్ పెట్టాడు. ఆ వ్యక్తికి సమాధానం ఇస్తూ మీరు ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారు అంటూ అసహనం వ్యక్తం చేసింది.