స్వాతి ఆ సినిమా నుంచి తప్పుకుందా?

Update: 2017-04-01 10:13 GMT
తెలుగమ్మాయి స్వాతి రెడ్డి తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలమైంది. ఎప్పుడో ఏడాదిన్నర కిందట వచ్చిన ‘త్రిపుర’ తెలుగులో ఆమె చివరి సినిమా. దాని తర్వాత ఆమె టాలీవుడ్ వైపు చూడలేదు. తనకు మంచి ప్రయారిటీ ఇచ్చే తమిళ సినిమాలకే పరిమితమైంది. ‘త్రిపుర’ సినిమాలో ఆమె ఫిజిక్ గురించి తీవ్ర విమర్శలు రావడంతో మధ్యలో ఇంకే సినిమా అవకాశం రాలేదు. దీంతో స్వాతి ఈ మధ్య కొంచెం బరువు తగ్గి టాలీవుడ్ దర్శకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేసింది.

ఈ మధ్యే ఆదిత్య అనే కొత్త దర్శకుడు స్వాతి ప్రధాన పాత్రలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి రంగం సిద్ధం చేశాడు. ‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధును ఇందులో హీరోగా అనుకున్నారు. ప్రి ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేశారు. ఇంతలో ఏమైందో ఏమో.. ఆ సినిమా నుంచి స్వాతి తప్పుకుందని సమాచారం. స్వాతి నో చెప్పేయడంతో ఈ పాత్రకు వేరే నటిని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారట దర్శక నిర్మాతలు.

ఐతే స్వాతి తెలుగులో ఇంకో సినిమా చేయబోతోంది. వీడు తేడా.. బ్రదరాఫ్ బొమ్మాళి సినిమాలు తీసిన చిన్ని కృష్ణ దర్శకత్వంలో ఓ తమిళ రీమేక్ లో స్వాతి నటించనుంది. విజయ్ సేతుపతి నటించిన ‘ఆండవన్ కాట్టలై’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసమే ఇంతకుముందు ఒప్పుకున్న చిత్రం నుంచి స్వాతి తప్పుకుందేమో తెలియదు. ఈ రీమేక్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News