కలర్స్ స్వాతి ఇంకో ఛాన్స్ పట్టేసింది

Update: 2017-03-08 08:01 GMT
‘త్రిపుర’ మూవీలో స్వాతిని చూసి తెలుగు ప్రేక్షకులు బెంబేలెత్తిపోయారు. లావెక్కి షేపవుట్ అయిపోయిన స్వాతి తన అభిమానుల్ని తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా కూడా దానికి తగ్గట్లే ఉండటంతో కెరీర్లో బాగా గ్యాప్ వచ్చేసింది స్వాతికి. ఐతే ఈ మధ్యే కొంచెం బరువు తగ్గి స్లిమ్ముగా తయారైన స్వాతికి మళ్లీ తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. ఆదిత్య అనే కొత్త దర్శకుడితో ‘గుంటూరు టాకీస్’ హీరో సిద్ధు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో స్వాతి కథానాయికగా అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళ సూపర్ హిట్ మూవీ ‘ఆండవన్ కాట్టలై’కి రీమేక్ గా రానున్న సినిమాలోనూ స్వాతినే హీరోయిన్ గా చేస్తోంది.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘కాకా ముట్టై’తో కోలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మణికందన్ రూపొందించిన సినిమా ‘ఆండవన్’ కాట్టలై. విజయ్ సేతుపతి.. రితికా సింగ్ (గురులో చేస్తున్న అమ్మాయి) జంటగా నటించిన చిత్రమిది. బ్రోకర్ల దందా నేపథ్యంలో సాగే ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని వీడు తేడా.. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి లాంటి సినిమాలు తీసిన చిన్ని కృష్ణ తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. విశేషం ఏంటంటే తమిళంలో విజయ్ సేతుపతి లాంటి సీనియర్ హీరో చేసిన క్యారెక్టర్ని తెలుగులో రక్షక్ అనే కొత్త కుర్రాడు చేస్తుంటే.. రితికా సింగ్ లాంటి కొత్త హీరోయిన్ చేసిన పాత్రను స్వాతి చేయబోతోంది. పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న స్వాతి.. ఓ కొత్త హీరో పక్కన ఎలా ఉంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News