వియ్ లవ్ బ్యాడ్ బోయ్స్.. అంటూ ఇరగదీసేసింది శ్వేతా భరద్వాజ్. స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డిస్కవరీ ఈవిడ. ఆ సాంగ్ తర్వాత టాలీవుడ్ లో కనిపిస్తే ఒట్టు. కాని బిజినెస్ మేన్ లో ఐటెమ్ నంబర్ ని తెలుగు యువత అంత తేలిగ్గా మర్చిపోలేదు. శ్వేత డ్యాన్స్ మూవ్స్ కి ఇప్పటికీ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా హీరో గోపిచంద్ - దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి - భవ్య క్రియేషన్స్ అధినేతలు శ్వేతా భరద్వాజ్ కి వీరాభిమానులు.
అందుకే తమ లేటెస్టు సినిమా సౌఖ్యంలో ఐటెమ్ నంబర్ చేయాల్సిందిగా శ్వేతాపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. తను ఎక్కడో ఫోర్చుగల్ లో రిలాక్స్ మోడ్ లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో ఇండియా రావాల్సిందే, మా సినిమాలో ఐటెమ్ నంబర్ చేయాల్సిందే.. అంటూ ప్రెజర్ ఇచ్చారుట. ఈ సంగతిని శ్వేత స్వయంగా చెప్పింది. నిజానికి నాకు ఆ ఐటెమ్ లో చేయాలన్న మూడ్ లేదు. ఎక్కడో ఉన్నా.. రాలేన అని చెప్పాను. కానీ ఎట్టి పరిస్థితిలో రావాల్సిందేనని పట్టుబట్టడంతో ఇండియా రాక తప్పలేదు. పోనీ అలా వచ్చినందుకు .. లాలీపాప్ ఐటెమ్ నంబర్ కోసం ప్రాక్టీస్ చేసేంతటి సమయం కూడా లేదు. నాలుగు రోజుల షూట్ అంటే రోజూ వేకువఝామున 5 గంటలకే నిద్ర లేచి ప్రాక్టీస్ చేయాల్సొచ్చేది.
ఉన్న తక్కువ సమయంలోనే చేసేశాను. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఆన్ సెట్స్ ఈజీగానే ఇరగదీశా. కానీ ఎంతో ఒత్తిడిలో చేయాల్సొచ్చింది. పైగా ఒకే కాస్ట్యూమ్ లో నాలుగు రోజుల షూట్. కొత్త కాస్ట్యూమ్ తేవాలన్నా టైమే లేదాయే. కనీసం ఉన్న కాస్ట్యూమ్ డ్రైక్లీనింగ్ చేయడానికి కూడా లేదు. ఒకే కాస్ట్యూమ్ లో అన్నిరోజులు షూట్ చేశారు... అని లాలీపాప్ కష్టాలు చెప్పుకొచ్చింది.