మెగాస్టార్ చిరంజీవి హీరోగా 150 సినిమాల కెరీర్ లోనే భారీ చిత్రంగా రూపొందిన సైరా విడుదల కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం ఇంకో 28 రోజుల్లో బాస్ బాక్స్ ఆఫీస్ స్టామినా చూస్తారంటూ అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా గడువు ముంచుకొస్తున్న తరుణంలో కొణిదెల టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ ని వేగవంతం చేసింది. చిరు స్వీయ పర్యవేక్షణలో ఇవి జరుగుతున్నట్టుగా సమాచారం.
ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్న సీన్స్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసి మరీ ఫైనల్ చేస్తున్నారట. సాహో తర్వాత వస్తున్న క్రేజీ మూవీ కాబట్టి బయ్యర్లు సైతం దీని మీద భారీ పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం సైరా రన్ టైంని ప్రాధమికంగా లాక్ చేశారని తెలిసింది. ఫస్ట్ స్టేజిలో ఓకే చేసిన వెర్షన్ 2 గంటల 45 నిమిషాల దాకా వచ్చిందట. మరోసారి వెరిఫై చేసి అవసరమైన చోట కటింగ్స్ ఉంటే మొహమాటం లేకుండా చేసేయమని దర్శకుడు సురేందర్ రెడ్డికి చిరు సూచించారట.
మరోవైపు ఆర్ ఆర్ ఆర్ సన్నాహకాల్లో ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్న రామ్ చరణ్ కూడా ఇవన్నీ ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ చెక్ చేసుకుంటూ బిజినెస్ డీల్స్ పూర్తి చేస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలకు సహజంగానే లెన్త్ ఎక్కువ అవసరం పడుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు సెట్ చేసుకున్న నిడివిని అలాగే ఉంచేస్తారా లేక ఏమైనా తగ్గిస్తారా ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది