మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హిస్టారికల్ మూవీ 'సైరా' షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక మెగా అప్డేట్ అభిమానులను మురిపించేలా ఉంది.
రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో మెగాస్టార్ చిరంజీవిపై ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారట సురేందర్ రెడ్డి. ఈ పాటలో ఎన్నడూ లేని విధంగా 1000 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారట. ఈ పాటను 12 రోజుల పాటు చిత్రీకరిస్తారని.. ఈ పాటకు భారీ స్థాయిలో ఖర్చు అవుతుందని అంటున్నారు. 'సైరా' సినిమాలో ఇది ఒక మేజర్ హైలైట్ కానుందని.. టాలీవుడ్ చరిత్రలోనే ఈ స్థాయిలో ఖర్చు చేసి ఒక పాట ను చిత్రీకరించడం ఇది మొదటి సారి అని సమాచారం.
ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మిగాతా టాకీ పార్ట్ కూడా వీలైంత త్వరగా పూర్తి చేయాలని 'సైరా' టీమ్ బ్రేక్ తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఈమధ్యే సంక్రాంతి హాలిడేస్ కూడా తీసుకోకుండా 'సైరా' టీమ్ షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీ స్థాయిలో ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కు కాస్త ఎక్కువ సమయమే పడుతుందని అంటున్నారు. 'సైరా' ను ఈ ఏడాది దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చరణ్-సురేందర్ రెడ్డి టీమ్ ప్లాన్ చేస్తున్నారు.