తాప్సీ.. సైలెంటుగా కానిచ్చేస్తుందట

Update: 2015-07-21 08:29 GMT
ఊరంత పందిరి.. పందిరి నిండా లైటింగ్‌, బ్యాండ్‌ బాజా, బరాత్‌ .. ఇవన్నీ ఓవైపు... చుట్టాలు, పక్కాలు, భోజనాలు, ఎకసెక్కాలు ఇవన్నీ మరోవైపు.. పెళ్లంటే ఆమాత్రం సందడి ఉండాలి. బ్యాండుమేళం సౌండు కి ఊరంతా దద్దరిల్లిపోవాలి. దిక్కులు పిక్కటిల్లాలి. అలా లేనిదే కొందరికి పెళ్లి చేసుకున్నట్టు అనిపించదు. అస్సలు ఆ ఫీలే రాదు. కానీ కొందరు వీటన్నిటికీ విరుద్ధం.

కనీసం పెళ్లి అయినా ఏ గోలా లేకుండా చేసుకోవాలి. కనుదిష్ఠి తగలకుండా తక్కువ మంది సమక్షంలో చేసుకోవాలి.. అని అనుకుంటారు. లో ప్రొఫైల్‌ లో పెళ్లి చేసుకుంటే ఆహ్లాదంగా ఉంటుందని భావిస్తుంటారు. అలాంటివాళ్లలో షాహిద్‌ కపూర్‌ కూడా ఉన్నాడు. ఇటీవలే అతడు చడీ చప్పుడు లేకుండా సైలెంటు గా ఢిల్లీ అమ్మాయి మీరా రాజ్‌పుత్‌ ని పెళ్లాడేశాడు. ఇప్పుడు అదే బాపతులో పెళ్లి చేసుకోవడానికి నేను కూడా రెడీ అంటోంది తాప్సీ. ఈ అమ్మడు ప్రస్తుతం రన్నింగ్‌ షాదీ డాట్‌కాం చిత్రంలో నటిస్తోంది.

షాదీ రిలేటెడ్‌ సినిమా కాబట్టి .. ఆ ప్రభావమో ఏమో.. ఇటీవలే స్నేహితురాలు, సోదరి తో కలిసి తాప్సీ ఓ వెడ్డింగ్‌ ప్లానర్‌ కంపెనీ ప్రారంభించింది. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. పెళ్లిళ్లను ఘనంగా దగ్గరుండి మరీ చేస్తోంది. ఈ సందర్భంగా తన పెళ్లి ప్రస్థావన వచ్చినప్పుడు పైవిధంగా స్పందించిందన్నమాట! ఏ హడావుడి లేని పెళ్లి మీక్కూడా ఇష్టమైతే తాప్సీ ని ఫాలో అయిపోండి బ్రదర్స్‌. మీ పెళ్లయినట్టే!!
Tags:    

Similar News