హాలీవుడ్ ఆకలి లేని హీరోయిన్

Update: 2018-05-21 04:50 GMT
హాలీవుడ్ ఆకలి లేని హీరోయిన్
  • whatsapp icon
ఒక్కో మెట్టు ఎక్కుతూ కెరీర్ ను దివ్యంగా మలచుకోవాలని ఎవరైనా అనుకుంటారు. సినిమా జనాల వరకు వస్తే.. టాలీవుడ్ లోనే కాదు.. ఎక్కడ కెరీర్ స్టార్ట్ చేసినా సరే.. వారి తర్వాతి టార్గెట్ బాలీవుడ్ అవుతుంది. అక్కడ కూడా సత్తా చాటిన తర్వాత హాలీవుడ్ లో వెలిగిపోయేందుకు ట్రయల్స్ వేస్తుంటారు.

కానీ తాను మాత్రం బాగా డిఫరెంట్ అంటోంది ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను. మొదటి నుంచి ఇప్పటివరకూ తన కెరీర్ లో అన్నీ వాటంతట అవే జరిగిపోయాయి తప్ప.. తాను ఎన్నడూ ప్రొఫైల్ పట్టుకుని ఎవరి దగ్గరకూ అవకాశాల కోసం వెళ్లి అడగలేదని చెబుతోంది. అలాగే తాను హాలీవుడ్ సినిమాల కోసం ప్రయత్నాలు చేయడం లాంటి పనులు చేయనని అంటోంది ఈ హీరోయిన్. అలాగని తాను హాలీవుడ్ లో నటించేందుకు వ్యతిరేకిని కాదన్న తాప్సీ.. అవకాశం వస్తే చేయడం వేరు.. అవకాశం వెతుక్కుంటూ తిరగడం వేరు అంటూ అర్ధాలు కూడా చెబుతోంది.

'నాకు ఇక్కడ చెప్పుకోదగినన్ని సినిమాలు ఉన్నాయి. మంచి పాత్రలు కూడా అందుతున్నాయి. నేను కోరుకున్న క్యారెక్టర్స్ వస్తున్నాయి. అందుకే హాలీవుడ్ లో వాలిపోవాలనే కోరిక.. ఆలోచన.. ఆకలి నాకు లేవు. హాలీవుడ్ లో స్టాండర్డ్స్ ఎక్కువగా ఉంటాయని అంగీకరించిన తాప్సీ పన్ను.. వాటిని అందుకునేందుకు ఇండియన్ మూవీ మేకర్స్ ప్రయత్నించడం సహజమే అంటోంది.
Tags:    

Similar News