తెలుగులో నటించి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ హీరోయిన్ గా స్థిరపడ్డ తాప్సి పన్ను సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఏ సమస్యపైన అయినా కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాన్ని పంచుకుంటుంది. హిందీ 'పింక్' మూవీలో ఈమె నటనకు ప్రశంసలు దక్కాయి. కొన్నా చాలెంజింగ్ రోల్స్ స్ఫూర్తినిచ్చే కథలో తాప్సి నటించి మెప్పింది.
తాజాగా ఓ రేప్ కేసులో ఇటీవల వచ్చిన తీర్పుపై తాప్సీ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేసింది. ఈ తీర్పుపై తాప్సీతోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఇటీవలే ఓ సంచలన తీర్పు చర్చనీయాంశమైంది.. చట్టబద్ద వివాహంలో భార్యతో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించలేమని ఓ హైకోర్టు పేర్కొంది. వైవాహిక అత్యాచార అభియోగం ఎదుర్కొంటున్న ఓ భర్తను నిర్ధోషిగా ప్రకటించింది. అదే సమయంలో భార్యతో అతడు జరిపిన అసహజ శృంగార చర్యలను నేరంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. 18 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న భార్యతో ఆమె భర్త శృంగారం లేదా శృంగారపరమైన చర్యను రేప్ గా పరిగణించలేం.. ఈ కేసులో ఫిర్యాదుదారు.. అభియోగాలు మోపబడిన వ్యక్తికి చట్టబద్దంగా భార్య కాబట్టి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అతడు ఆమెతో బలవంతపు శృంగారం చేసినా దాన్ని అత్యాచారంగా పరిగణించలేం అని హైకోర్టు వ్యాఖ్యానించింది.అసహజ రీతిలో శృంగార చర్యలకు పాల్పడడాన్ని మాత్రం నేరంగా పరిగణిస్తున్నట్టు హైకోర్టు వెల్లడించింది.
తాప్సీ పన్ను ట్వీట్ చేస్తూ 'ఇది మాత్రమే మిగిలింది ఇప్పుడు వినడానికి' అని పరోక్షంగా నర్మగర్భంగా తన అభిప్రాయాన్ని పంచుకుంది. కోర్టు తీర్పును గౌరవిస్తూనే తాప్సి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
ఇక గాయని సోనా మొహపాత్ర కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. 'ఇది చదివిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను' అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.