తాప్సీ.. రెండేళ్ల తర్వాత..

Update: 2015-12-10 11:38 GMT
తాప్సీ పన్ను డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించి చాలాకాలామే అయింది. రీసెంట్ లక్ష్మి మంచు దొంగాటలో కనిపించింది కానీ.. పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రేమీ కాదు. దీనికి ముందు టాలీవుడ్ లో అమ్మడు చేసిన చివరి సినిమా సాహసం. రెండేళ్లు గడిచిపోయినా ఇప్పటివరకూ తెలుగు నుంచి తాప్సీకి ఆఫర్ రాలేదు. అయినా సరే ఇక్కడొచ్చిన ఈ బ్రేక్ సమయంలోనే కోలీవుడ్ లో ఇరగదీసేసింది తాప్సీ.

ఇప్పుడక్కడ లీడ్ హీరోయిన్లలో ఒకరిగా అవతరించేసింది. ప్రస్తుతం తాప్సీ రాణా సరనస ఘాజీ అని సినిమాలో నటిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న మూవీ ఇది. 1971లో మునిగిపోయిన పాక్ సబ్ మెరైన్ కథే ఘాజీ. ఇందులో తాప్సీ కేరక్టర్ బాగా టఫ్ గా ఉంటుందట. తన కేరక్టర్ కి ప్రిపేర్ అయేందుకు బోలెడు టైం అడిగానని చెబ్తోంది. స్క్రిప్ట్ ను బాగా స్టడీ చేసి - ఈ పాత్ర కోసం ప్రిపేర్ అయిందట తాప్సీ. ఈ నెలాఖర్లో ఘాజీ యూనిట్ తో కలిసి షూటింగ్ ప్రారభించనుంది ఈ ఢిల్లీ బ్యూటీ. రెండేళ్ల తర్వాత ఈ సినిమా కోసం హైద్రాబాద్ లో అడుగుపెట్టింది తాప్సీ పన్ను. అప్పట్లో సాహసం తర్వాత మళ్లీ హైద్రాబాద్ లో షూటింగ్ చేయాల్సిన అవసరం ఈ భామకు రాలేదు.

సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో మన దేశంలో రూపొందుతున్న తొలి సినిమాగా రికార్డుల్లోకి ఎక్కనున్న ఘాజీని.. కొత్త డైరెక్టర్ సంకల్ప రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. పీవీపీ సినిమా నిర్మాణం వహిస్తోంది.  

Tags:    

Similar News