రొమాంటిక్ గీతాలతో ఆనాటి యువతని ఓ ఊపు ఊపిన రవీనా టాండన్ గురించి పరిచయం అవసరం లేదు. ముందుగా టాలీవుడ్ సినిమాల్లోనే స్థిరపడాలని ప్రయత్నించింది. కానీ ఇక్కడ అవకాశాలు పెద్దగా రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ కే వెళ్లిపోయి స్థిరపడింది. ఆ తర్వాత అడపాదడపా తెలుగు సినిమాల్లో ఇప్పటికీ కనిపిస్తోంది. అవకాశం వస్తే తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. రవీనా టండన్ టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇక సొట్టబుగ్గల తాప్సీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో చాలా సినిమాల్లో నటించి చివరిగా బీటౌన్ లో స్థిరపడింది.
భవిష్యత్ ని అక్కడే ప్లాన్ చేసుకుని ముందుకు కదులుతోంది. అక్కడ నేరుగా ఓ సొంత ప్రొడక్షన్ హౌస్ ని సైతం మొదలు పెట్టింది. ఓవైపు నటిగా బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు నిర్మిస్తుంది. ఇలా సీనియర్ హీరోయిన్.. జూనియర్ భామల కెరీర్ జర్నీ ముందుకు సాగిపోతోంది. అయితే వీళ్లిద్దరి ముందుకి ఓ ఆసక్తికర ప్రశ్న వెళ్లింది. మీకు ఉన్న అతి పెద్ద భయం ఏమిటో చెప్పండి? అంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. రవీనా టండన్ ఇలా స్పందించారు. షూటింగ్ చేస్తున్న సమయంలో దర్శకులు కన్ప్యూజన్ లో ఉండి మరోలా సీన్ ట్రై చేద్దామని అడిగితే ఏం చెప్పలేను. ఎందుకంటే అప్పటికే ఆ పాత్రకి కావాల్సిన యాటిట్యూడ్ ని సిద్ధం చేసి ఉంచుతాను.
అలాంటి సమయంలో దర్శకులు ఇలాంటి మెలికలు వేస్తే నా మొదడులో యుద్దం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇదే ప్రశ్న తాప్సీ ని అడిగితే కొందరు దర్శకులు మొదట అనుకున్నది వేరు..సెట్ కొచ్చిన తర్వాత వేరుగా ఉంటారు. అప్పటికప్పుడు వాళ్లు ఎలా చెబితే అలా చేయాలంటారు. ఇలాంటి విధానం నన్ను చాలా భయానికి గురి చేస్తుంది. సీన్ ఎలా ఉండాలి? అన్నది ఓ డిజైన్ మ్యాప్ క్లారిటీగా ఉండాలి. కనీసం నెక్స్ట్ షాట్ ఏంటి? అన్నది ముందుగానే తెలియాలి. లేకపోతే ఏ నటి అయినా గందరగోళానికి గురికాక తప్పదని రవీనా వ్యాఖ్యల్ని సమర్ధించింది.