మీటూలో రంగోలి సిస్ట‌ర్‌ కి స‌పోర్టా?

Update: 2019-06-04 06:08 GMT
సింహం ఒక‌డుగు వెన‌క్కి వేస్తే ప‌ద‌డుగులు ముందుకేస్తుంది! అన్న‌ట్టే ఉంది తాప్సీ హెచ్చ‌రిక‌. మీటూ ఉద్య‌మంలో అరోప‌ణ‌లు ఎదుర్కొన్న న‌టులు.. డైరెక్ట‌ర్లు క్లీన్ చిట్ తో ఎస్కేప్ అవుతుంటే.. వీళ్ల‌ను వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని కంగ‌న- రంగోలి సిస్ట‌ర్స్ గగ్గోలు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వేధింపుల రాక్ష‌సుల్ని వ‌దిలేసి అమాయ‌క మ‌గువ‌ల‌ ప‌రువు తీస్తున్నారంటూ కంగ‌న సిస్ట‌ర్ రంగోలి ఆవేద‌న క‌న‌బ‌రిచిన నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా చ‌ర్చ సాగుతోంది. ఇక‌పోతే ఇలా వ‌దిలేసిన వాళ్ల‌ను వెంటాడు వేటాడు ప్రాతిప‌దిక‌న ఉతికి ఆరేసేందుకు క్వీన్ కంగ‌న & సిస్ట‌ర్స్ ఎల్ల‌పుడు ప్రిప‌రేష‌న్ లోనే ఉన్నారు. అలోక్ నాథ్.. వికాస్ బాల్ లాంటి ప్ర‌ముఖుల‌కు క్లీన్ చిట్ ల‌భించ‌డంతో కంగ‌న సోద‌రి రంగోలి మ‌రోసారి ప‌బ్లిగ్గానే త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది.

తాజాగా తాప్సీ చేసిన‌ తాజా వ్యాఖ్య రంగోలీకి బాస‌ట‌గా నిలుస్తోంది. మీటూ వేదిక‌గా ఆరోప‌ణ‌లు వ‌చ్చినా బాధితుల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని .. ఏళ్ల త‌ర‌బ‌డి జ‌రుగుతున్న ఆకృత్యాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని తాప్సీ వ్యాఖ్యానించడం సంచ‌ల‌న‌మైంది. అలాగ‌ని ఇప్ప‌టితో  ఈ ఉద్య‌మంలె  వెన‌క్కి త‌గ్గేది లేదు.  బాధితురాళ్లు ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గొద్దు. వాస్త‌వాల్ని మీటూ వేదిక‌గా చెప్పండి. ఈ ఉద్య‌మాన్ని మునుముందు ఇంకా స్పీడ‌ప్ చేద్దాం. ఉధృతం చేసి పోరాటం సాగిద్దాం`` అంటూ పిలుపునిచ్చారు తాప్సీ.

``ఇది మార్పు కోరుతున్న త‌రుణం. ఇప్పుడే వెన‌క‌డుగు వేయ‌కూడ‌దు. ఏం జ‌రిగినా ముందుకే దూసుకెళ్లాలి. క‌ష్టాలు ఎదుర‌వుతాయి. ఇబ్బందులు వ‌స్తాయి. అయినా అన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ‌దాం!`` అంటూ తాప్సీ స్ట్రాంగ్ పిలుపునివ్వ‌డంతో ఇక మీటూకి ఎంతో స‌పోర్ట్ దొరికిన‌ట్ట‌య్యింది. తొలి నుంచి మీటూ ఉద్య‌మానికి తాప్సీ త‌న‌వంతు మ‌ద్ధ‌తు ప‌లికారు. మ‌గువ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు ఈ ఉద్య‌మాన్ని బ‌లంగా స‌పోర్ట్ చేశారు. తాజా ప‌రిస్థితిలో ఉద్య‌మాన్ని అస్స‌లు విడిచిపెట్టొద్ద‌ని బ‌ల‌మైన సందేశాన్ని తాప్సీ ఇచ్చిన‌ట్ట‌య్యింది. ఓ ర‌కంగా కంగ‌న - రంగోలి సిస్ట‌ర్స్ కి బాస‌ట‌గా నిల‌వ‌డ‌మే ఇది.


Tags:    

Similar News