83 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌ క‌పిల్ దేవ్ వైఫ్ ఈవిడే

Update: 2020-02-19 08:00 GMT
ఎం.ఎస్.ధోని- యాన్ అన్ టోల్డ్ స్టోరి- భాగ్ మిల్కా భాగ్- మేరీకోమ్ .. స్పోర్ట్స్ బ‌యోపిక్ ల‌కు ఉన్న క్రేజు గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఇప్ప‌టికే ఎన్నో క్రీడా బ‌యోపిక్ లు బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించాయి. అదే కేట‌గిరీలో రాబోతున్న మ‌రో సినిమా 83. క్రికెట్ నేప‌థ్యంలో చిత్ర‌మిది. 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విక్ట‌రీలో టీమిండియా కెప్టెన్ క‌పిల్ దేవ్ పాత్రను.. టీమిండియా విక్టరీ ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ర‌ణ‌వీర్ సింగ్ క‌పిల్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అత‌డి భార్య `రోమి దేవ్` (Romi-Dev) పాత్ర‌ లో రియల్ వైఫ్‌ దీపిక ప‌దుకొనే న‌టిస్తోంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నిర్మాతలు విష్ణువర్ధన్ ఇందూరి- మధు మంతెన- దీపిక‌ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా నాగార్జున స‌మ‌ర్పిస్తున్నారు. 2020 ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదలవుతోంది.

83 ఫ‌స్ట్ లుక్ స‌హా టీజ‌ర్ రిలీజై ఆక‌ట్టుకున్నాయి. క‌పిల్ పాత్ర‌లోకి ర‌ణ‌వీర్ ఒదిగిపోయి న‌టించాడని అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ సినిమాకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే.. క‌పిల్ వైఫ్ రోమీ పాత్ర‌లో దీపిక న‌టించారు. అయితే త‌న లుక్ ఇంత‌వ‌ర‌కూ పూర్తి క్లారిటీతో రాలేదు. తాజాగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ చూశాక‌.. దీప్ వీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయి పోతున్నారు. క‌పిల్ రియ‌ల్ లైఫ్‌ విక్ట‌రీలో కీల‌క సూత్ర‌ధారి ఇలా చిరున‌వ్వులు చిందిస్తూ ఎంతో స్ఫూర్తి నింపార‌న్న‌మాట‌.

ఇటీవ‌లే దీపిక న‌టించి నిర్మించిన `చ‌పాక్` ఊహించ‌ని విధంగా ఫ్లాపైంది. న‌టిగా త‌న‌కు పేరొచ్చినా ఫ్లాపైనందుకు నిర్మాత హోదాలో నిరాశ‌ప‌డింది. ఆ నిరాశ‌నుంచి బ‌య‌ట‌ప‌డేంత పెద్ద‌ హిట్టు కొడుతుందా ఈసారి? 83 త‌న డ్రీమ్ ని నెర‌వేరుస్తుందా? అన్న‌ది చూడాలి. భ‌ర్త‌తో క‌లిసి న‌టిస్తున్న ఈ మూవీ నిరాశ‌ప‌ర‌చ‌కుండా సెంటిమెంటుగా హిట్ట‌వుతుందేమో!!
Tags:    

Similar News