ఇంటా బైటా బాహుబలి గురించి మోత మోగిపోతోంది. ఒకటే ప్రచారం మోత. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన వార్ ఎపిక్ చిత్రమిదని ప్రచారం ఊదరగొట్టేస్తున్నారు. అయితే తెలుగు, తమిళ్‌లో వర్కవుటైనట్టు హిందీలో ఈ సినిమా వర్కవుటవుతుందా? రానా ఎవరో పరిచయం ఉన్నా, లీడ్ పాత్రధారి ప్రభాస్ ఎవరో హిందీ ప్రేక్షకులకు తెలియనే తెలియదు కదా! అన్న కొత్త సందేహాల్ని వెలిబుచ్చుతున్నారంతా.
ఉన్నట్టుండి రాజమౌళి కరణ్‌జోహార్‌తో స్నేహం పెంచుకున్నంత మత్రాన, కరణ్ ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేసినంత మాత్రాన ఓ లోకల్ సినిమా ఆడినట్టు ఆడుతుందా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. రాజమౌళి సినిమాలు ఎలా ఉంటాయో మగధీర, ఈగ సినిమాలు చూసి హిందీ జనం తెలుసుకున్నారు. అయినంత మాత్రాన తెలుగు అనువాదాలకు అక్కడ అస్సలు గిరాకీ లేనేలేదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సినిమాకే పెద్దగా ఆదరణ లేదక్కడ. రోబోట్, ఐ వంటి విజువల్ వండర్స్‌ని సైతం బాలీవుడ్ జనాలు నిర్ధయగా తిరస్కరించారు. కేవలం అనువాద చిత్రం అన్న మిషతో థియేటర్లకు రానేలేదు. ఇప్పుడు అదే పరిస్థితి బాహుబలికి వస్తే? ఇదే విషయంపై పలువురు బయ్యర్లు కాస్త భయపడుతున్నారట.
అయితే ఇప్పటికే దిల్ దడ్కనే దో చిత్రంతో పాటు బాహుబలి ట్రైలర్స్‌ని థియేటర్లలో చూపించారు. దీనికి జనాల్లోంచి చక్కని స్పందన వచ్చింది. అక్కడ హిట్టెక్కడానికి హిట్టెక్కకపోవడానికి ఓ సన్నని లైన్ ఉంది. పూర్తిగా హీరో ఎవరు? అనేదానికంటే విజువల్స్ ఎలా ఉన్నాయి? అన్నదానినే పరిగణించి సినిమాకి వస్తారు.. అని విశ్లేషిస్తున్నారు. పైగా బాహుబలి సినిమా రిలీజవుతున్న నెలలోనే సల్మాన్‌ఖాన్ భజరంగి భైజాన్ రిలీజవుతోంది. కాబట్టి ఆ మేరకు థ్రెట్ తప్పదేమో. ఇలాంటి సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తూ తెలుగు సినిమా బాహుబలి ఉత్తరాదినా రికార్డులు తిరగరాయాలని ఆకాంక్షిద్దాం.