ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఒకటిగా చెప్పొచ్చు ‘క్వీన్’ సినిమాను. రేపు పెళ్లి అనగానే ఈ రోజు వరుడు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని వధువుకు చెబుతాడు. పెద్దగా లోకం తెలియని ఆ అమాయకురాలికి ఏం చేయాలో తోచదు. ఆ మాటతో తన కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అలాంటి స్థితిలో అంతకుముందు ప్లాన్ చేసుకున్న హనీమూన్ కు ఒక్కత్తే వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. తల్లిదండ్రులు వారిస్తున్నా వినకుండా ప్యారిస్ బయల్దేరుతుంది. ఈ సింగిల్ హనీమూన్ ముగిసే సరికి తన ఆమె తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుందన్నది ‘క్వీన్’ కథ. స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ నిర్మించిన ఈ చిత్రానికి వికాస్ బాల్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించాడు.
‘క్వీన్’ సినిమాకు కంగనా నటనే ప్రధాన ఆకర్షణ. రాణి పాత్రలో ఆమె అదరగొట్టింది. పాత్రలో వేరియేషన్స్ ను అద్భుతంగా పండించింది. ఈ పాత్రకు ఆమె జాతీయ అవార్డు కూడా అందుకుంది. కంగన పాత్రలో మరొకరిని ఊహించుకోలేం అన్నట్లుగా నటించిందామె. ఇప్పుడీ పాత్రను తమిళ.. తెలుగు భాషల్లో తమన్నా చేయబోతోంది. ముందు తమిళం వరకే తమన్నా అన్నారు కానీ.. తెలుగు వెర్షన్ కూడా ఆమెతోనే లాగించేస్తారట. మరి తమ్మూ ఆ పాత్రను ఎలా పోషిస్తుందన్నది ఆసక్తికరం. బహుశా ఈ మధ్య వచ్చిన ‘అభినేత్రి’ చూశాక ఈ పాత్రకు తమన్నా సూటవుతుందని నిర్మాత త్యాగరాజన్ కు నమ్మకం కుదిరిందేమో. అందులో సంప్రదాయబద్ధంగా కనిపించే పల్లెటూరి అమ్మాయిగా.. మోడర్న్ గా కనిపించే సినీ నటిగా రెండు వేరియేషన్లున్న పాత్రలో అదరగొట్టేసింది తమ్మూ. తమన్నా కెరీర్లో అది బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. ఈ పెర్ఫామెన్సే ఆమెకు ‘క్వీన్’ రీమేక్ లో నటించే అవకాశాన్నిచ్చినట్లుంది. మరి కంగనాను మరిపించేలాగా తన నటనతో తమ్మూ మురిపిస్తుందేమో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/