ఐటెం సాంగ్స్ చిన్న చూపు చూసేవాళ్లు ఒకప్పుడు. ఆ పాటల్లో స్టెప్పులేసేవాళ్ల మీద అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం భామలు అయిపోతున్నారు. బాలీవుడ్లో మొదలైన ఈ ట్రెడిషన్.. ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ ఊపందుకుంటోంది. తమన్నా.. శ్రుతి హాసన్.. కాజల్ లాంటి టాప్ హీరోయిన్లు ఐటెం పాటల్లో అదరగొట్టేశారు. వీరిలో ముందుగా స్పెషల్ సాంగ్ చేసింది మిల్కీ బ్యూటీనే. ‘అల్లుడు శీను’ సినిమాలో నా ఒంటి పేరు మిల్కీ అంటూ సాగే పాటలో అదరగొట్టేసింది తమ్మూ. ఆ తర్వాత ‘స్పీడున్నోడు’లోనూ ఐటెం పాటలో ఆకట్టుకుంది.
తాజాగా తమన్నా.. కన్నడ కుర్రాడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వార్’ కోసం ఐటెం భామ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఈ పాటకు సంబంధించిన స్టిల్స్ బయటికి వచ్చాయి. అందులో తమన్నా లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఆమె డ్రెస్ కానీ.. ఆమె హావభావాలు కానీ చూస్తుంటే ఈ పాటలో తమ్మూ సెగలు పుట్టించబోతోందని అర్థమవుతోంది. ఈ పాట కోసం తమ్మూ కోటి రూపాయల దాకా పారితోషకం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అంత తీసుకున్నాక ఈమాత్రం రెచ్చిపోకుంటే కష్టం. నిఖిల్ ను హీరోగా నిలబెట్టడానికి కుమారస్వామి డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నాడు. ఈ సినిమా రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం విశేషం.