పిక్ టాక్ : కాస్త తగ్గి మళ్లీ కనువింధు చేసింది

Update: 2021-07-02 17:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా కు హీరోయిన్‌ గా ఈమద్య కాస్త ఆఫర్లు తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఒకప్పుడు వరుసగా స్టార్‌ హీరోలతో సినిమా లు చేసిన తమన్నా ఇప్పుడు మాత్రం వెబ్‌ సిరీస్ లు.. చిన్న చితకా సినిమా లతో కెరీర్‌ ను నెట్టుకు వస్తుంది. నెట్టింట ఈమె అప్పుడు ఇప్పుడు ఒకే తరహా లో సందడి చేస్తూనే ఉంది. కొన్ని వారాల క్రితం తమన్నా కరోనా బారిన పడటం వల్ల దాదాపుగా నెల రోజులు విశ్రాంతి తీసుకుంది. కరోనా నుండి కోలుకోవడానికి ఎక్కువ ఆహారం తీసుకోవడంతో పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలంటూ వైధ్యులు సూచించడంతో ఆమె పూర్తిగా విశ్రాంతి తీసుకుని ఎక్కువ ఫుడ్‌ తీసుకుంది. దాంతో ఆమె ఆమద్య కాస్త బరువు పెరిగినట్లుగా కనిపించింది. తమన్నా ఎప్పుడు లేనిది ఒక ప్రెస్ మీట్ లో కాస్త బొద్దుగా కనిపించడంతో మీడియా వర్గాల వారు సైతం ఆశ్చర్యపోయారు. ఆ సమయంలోనే ఆమె బరువు పెరిగింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో మిల్కీ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేసింది.

తాను ఏ పరిస్థితుల్లో లావు అయ్యాను అనే విషయం అందరికి తెలుసు. అయినా కూడా కొందరు నేను బరువు పెరిగిన విషయాన్ని ట్రోల్‌ చేయడం విడ్డూరంగా ఉందంటూ ఆ సమయంలో తమన్నా అసంతృప్తి వ్యక్తం చేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా ఎట్టకేలకు బరువు తగ్గింది. ఈమె ఇటీవల బరువు తగ్గి మరీ నెటిజన్స్ ముందుకు వచ్చింది. ఆమె బరువు తగ్గిన ఫొటో షూట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా లుక్ తో తమన్నా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముద్దుగుమ్మ తమన్నా మళ్లీ మునుపటి అందంతో మెరిసి పోతుంది అంటూ విమర్శించిన వారే ప్రశంసిస్తున్నారు.

ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ఆమె ఇటీవల రెండు వరుస వెబ్‌ సిరీస్ లను చేసింది. ఆ వెబ్‌ సిరీస్ లు ఆమెకు పాజిటివ్‌ మార్కులను తెచ్చి పెట్టినా కమర్షియల్ మాత్రం నిరాశ పర్చాయి. ఆ వెబ్‌ సిరీస్ ల ఫలితం ఎలా ఉన్నా కూడా ఈమెకు మళ్లీ మళ్లీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తెలుగు లో ఈమె సిటీ మార్ సినిమా లో నటించింది. ఆ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక నితిన్ మ్యాస్ట్రో సినిమా లో కూడా ఈమె నటించింది. హిందీలో అంధాదున్‌ లో టబు పోషించిన పాత్రను ఈపోషించిన విషయం తెల్సిందే. ఈ సినిమా తర్వాత తమన్నాకు మరిన్ని క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News