సెక్స్ - లవ్ గురించి ఓపెన్ గా మాట్లాడడం అంటే కష్టమే. కానీ ఆ రెండిటి గురించి ఎంతో బోల్డ్ గా మాట్లాడేసింది తమన్నా. ఆ రెండిటిపై అమ్మాయిల ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ అమ్మడు చెబుతుందట. అయితే అది రియల్ గా కాదు.. రీల్ లైఫ్ లో. నెక్ట్స్ ఏంటి? చిత్రంలో తమన్నా బోల్డ్ క్యారెక్టర్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేకెత్తిస్తుందనేది హాట్ టాపిక్.
హైదరాబాద్ లో జరిగిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ -``అర్బన్ బ్యాక్ డ్రాప్ సినిమా నెక్ట్స్ ఏంటి? నా ఏజ్‌కు తగినట్లు.. సిటీ కల్చర్ ను ఎలివేట్ చేసే పాత్రలో నటించాను. ఇది నా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే పాత్ర. ఇలాంటి పాత్ర చేయలేదే అనుకుంటున్న టైమ్ లో బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కొహ్లి ఈ కథతో నన్ను కలిశారు. నాకు బాగా నచ్చిన కథ ఇది.. కథ పరంగా పరిశీలిస్తే.. లండన్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రమిది. యూత్ ఫుల్ గా ఉంటుంది. నేటితరం ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. అలాగే నేటి తరం అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారనేది కూడా ఈ చిత్రంలో చూపించారు దర్శకుడు. వస్త్రధారణ - కనిపించే విధానాన్ని బట్టి అమ్మాయిలను అంచనా వేయకూడదని - వారి జీవితానికి సంబంధించిన నిర్ణయాలు వారే తీసుకునే హక్కు ఉంటుందని తెరపై చూపించారు`` అని తమ్మూ తెలిపింది. తనకు నచ్చిన అబ్బాయిని అమ్మాయి ఫేస్ చేసినప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఈ సినిమాలో చూపించారు. ప్రేమ - సెక్స్ అనేవి సాధారణ విషయాలు. వాటి గురించి బోల్డ్ గా మాట్లాడే యువతిగా కనిపిస్తానని వెల్లడించింది.
తమన్నా చెబుతున్నదానిని బట్టి.. అప్పట్లో ఓ క్లాసిక్ సినిమాని గుర్తు చేసుకోవాల్సి ఉంటుందేమో! 1982లో వచ్చిన `పట్నం వచ్చిన పతివృతలు` చిత్రంలో కథానాయికల పాత్ర తీరును పోలి ఉంటుందని మిల్కీ చెప్పిన దానిని బట్టి అర్థమైంది. రాధిక - గీత - రమాప్రభ నాయికలుగా - చిరంజీవి - మోహన్ బాబు హీరోలుగా నటించిన ఈ చిత్రానికి టి.ఎస్.బి.కె.మౌళి దర్శకత్వం వహించారు. రెబల్లియన్ ఆలోచనలుండే అమ్మాయిల వ్యవహారంపై సినిమా అది. సెక్స్ విషయంలో తమకంటూ కొన్ని స్వేచ్ఛా పూరితమైన అభిప్రాయాలు నేటి అమ్మాయిల్లో ఉండడం సహజం. దానివల్ల సమాజం ఎంత అడ్వాన్స్ డ్ గా ఉందో కూడా తెలిసినదే. స్త్రీ స్వేచ్ఛ అవసరం. కానీ అది పెనుముప్పునకు దారి తీయకూడదనే నెక్ట్స్ ఏంటి? లో తమ్మూ పాత్ర ద్వారా చూపిస్తున్నారేమో? ఈవారంలో నెక్ట్స్ ఏంటి రిలీజవుతున్న సంగతి తెలిసిందే.