గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఈ చిత్రం అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటించబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంను అతి త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. ఈ సమయంలో సినిమాలోని హీరోయిన్ పాత్ర గురించిన ఆసక్తికర విషయం ఒకటి సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
తమన్నా ఈ చిత్రంలో కబడ్డి కోచ్ పాత్రలో కనిపించబోతుంది. కబడ్డి నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం తమన్నా రెండు నెలల పాటు కబడ్డి శిక్షణ తీసుకోబోతుందట. కబడ్డి కోచ్ పాత్ర అయినా కూడా కబడ్డి విషయంలో పూర్తి అవగాహణ చేసుకోవడంతో పాటు ఆటలో మెలకువలు నేర్చుకునేందుకు తమన్నా రెండు నెలలు కేటాయించబోతుంది. లేడీ కబడ్డి ప్లేయర్స్ బాడీలాంగ్వేజ్ ను పరిశీలించి తన బాడీలాంగ్వేజ్ ను మరియు తన నటనను మార్చుకోవాలని తమన్నా భావిస్తోందట.
ఈ చిత్రంలోని తన పాత్ర ఒక పుల్లెల గోపీచంద్.. రమాకాంత్ అచ్రేకర్ ఇంకా పలువురు క్రీడా గురువులను రిప్రజెంట్ చేస్తూ ఉంటుందని తమన్నా చెబుతోంది. ప్రస్తుతం తమన్నా టాలీవుడ్ కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. ఆమె ఈ చిత్రంతో ఆకట్టుకుంటేనే భవిష్యత్తులో సినిమాలు ఉంటాయి. అందుకే ఈ చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.