వీడియో టాక్: మిల్కీ మెలికలు స్వింగింగ్!!

Update: 2017-09-15 13:08 GMT
రానున్న రోజుల్లో ఐటెమ్ సాంగ్స్ చేసే స్పెషల్ భామలు  కెరీర్ మీద ఆశలు వదులుకోవాలి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రస్తుతం. స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లో ఎంత హాటుగా కనిపించడానికైనా రెడీ అవుతున్నారు. నిర్మాతలు కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం రాజీపడటం లేదు. స్టార్ట్ హీరోయిన్స్ ఎంత అడిగితే అంత ఇచ్చేసి ఐటెమ్ సాంగ్స్ ని కథకు అవసరం లేకున్నా కావాలని చేయిస్తున్నారు. అయితే చాలా వరకు హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ సినిమాకి మంచి హైప్ ని తెస్తున్నాయి.

ఇప్పుడు అదే తరహాలో జై లవకుశ సినిమా కోసం కళ్యాణ్ రామ్ మిల్కీ బ్యూటీ తమన్నాను దించేశాడు. అల్రెడీ ఇంతకుముందే కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టిన తమన్నా ఇప్పుడు ఎన్టీఆర్ తో స్వింగ్ జరా అని మెలికలు తిరుగుతోంది. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో డాన్స్ కు సరిపోయేట్టు చేయాలి అంటే తమన్నాకే సాధ్యం అని దర్శకుడు ఏరి కోరి మరి మిల్కి బ్యూటీని ఎంచుకున్నాడట. అయితే పాటలో మిల్కి బ్యూటీ గ్లామర్ తో చంపేసింది అనే చెప్పాలి. హాటు హాటు స్టెప్పులను వేస్తూ.. వయ్యారాలను వలకబోసింది. స్వింగ్ జరా అనే పాట జనాల్లోకి ఈజీగా ఎక్కేస్తోంది అని చెప్పవచ్చు. కాకపోతే తమన్నా గతంలో ఇలాంటి మెలికలు స్వింగింగులు చాలాసర్లు తిరిగింది కాబట్టి.. కొందరికి కొత్తగా ఉండకపోవచ్చు.

పాటలో ఎన్టీఆర్ స్టెప్పులు కూడా మంచి ఎనర్జిటిక్ గా ఉన్నాయి. థియేటర్స్ లో ఫ్యాన్స్ విజిల్స్ వేయడం ఖాయంగా కనిపిస్తోంది. తమన్నా పోటా పోటీగా ఎన్టీఆర్ తో డాన్స్ చేసే ప్రయత్నం బాగానే చేసింది. దానికి తోడు ఎప్పటిలానే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ జోష్ ఇచ్చింది. మొత్తంగా సినిమాలోని స్వింగ్ జరాతో చిత్రాన్ని చూడాలనే కోరికను ఇంకాస్త పెంచింది అని అంటున్నారు నెటీజన్స్. ఇక ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కాబోతోంది.


Full View
Tags:    

Similar News