వీడియో: పడడం తప్పేమీ కాదట

Update: 2020-05-22 09:50 GMT
ఈతరం భామలందరూ ఫిట్నెస్ పై శ్రద్ధ చూపించేవారే.  మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అందుకు మినహాయింపేమీ కాదు.  15-ఇయర్స్ ఇండస్ట్రీ అయినప్పటికీ ఇంకా అదే గ్లామర్ మెయింటెయిన్ చేస్తుందంటే ఆరోగ్యంపై.. ఫిట్నెస్ పై ఎంత శ్రద్ధ చూపించాలి చెప్పండి? అప్పుడప్పుడు తమన్నా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఏదో ఒక ఎక్సర్ సైజ్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తమన్నా మరోసారి అలాగే ఒక వీడియో షేర్ చేసింది.

"మీకు పడడం అనే కళను పరిచయం చేస్తున్నా. సరిగ్గా చేయడానికి ముందు ఎన్నో సార్లు పడాల్సి.. ఒడిపోవాల్సి ఉంటుంది. ఎన్నోసార్లు సరిగ్గా పడిన తర్వాతే లేచి శీర్షాసనం వేయగాలిగాను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  దీంతో పాటుగా "ట్రైనర్ లేకుండా ఇలాంటివి ప్రాక్టీస్ చెయ్యకండి" అంటూ ఓ సూచన చేసింది.. దాన్ని మనం చట్టబద్ధమైన హెచ్చరిక అనుకోవచ్చేమో.  ఇలాంటి ఆసనాలు చూసేందుకు బాగానే ఉంటాయి.. కానీ అలవాటు లేకుండా.. సరైన ట్రైనింగ్ లేకుండా చేస్తే ఆ తర్వాత ఇంట్లో బెడ్ రూమ్ లో కనీసం మూడు నెలలు బెడ్ రెస్ట్ పేరుతో శవాసనం వెయ్యాల్సి వస్తుంది.

ఈ వీడియోలో తమన్నా తన ట్రెయినర్ సహాయంతో జాగ్రత్తగా శీర్షాసనం వేస్తుంది కానీ అంతా పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత కింద పడిపోతుంది. ఆ సమయంలో ట్రైనర్ "ఫాలింగ్ ఈజ్ ఆన్ ఆర్ట్" అనడం మనం వినొచ్చు.  ఇక సినిమాల విషయానికి వస్తే గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న 'సీటీమార్' నటిస్తోంది.  హిందీలో 'బోలె చూడియా' సినిమాలో నటిస్తోంది.


వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News