తమన్నా చేసే ఆ కొత్త పనులు ఏంటో?

Update: 2017-11-09 16:51 GMT
తమన్నా ఇప్పుడు వీర ఉత్సాహంతో ఉంది. తనకు ఎంతగానో నచ్చిన ‘క్వీన్’ సినిమా రీమేక్‌లో నటించబోతోంది మిల్కీ బ్యూటీ. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్యారిస్‌ లో మొదలైంది. అక్కడి వాతావరణం ఆమెకు చాలా చాలా నచ్చేసిందట. దాని గురించి చెబుతూనే తాను జీవితంలో ఇప్పటిదాకా చేయని పనులన్నీ అక్కడ చేయబోతున్నట్లు చెప్పింది తమ్మూ.

ఒక రోజు తనకు షూటింగ్ గ్యాప్ రావడంతో మొనాకో సిటీకి వెళ్లానని.. తాను అక్కడ మస్తీ చేయబోతున్నానని తమన్నా చెప్పింది. సముద్ర తీరాన ఉన్న ఈ నగరం చాలా బాగుందని.. ఈ సిటీ గురించి తాను ఇంతకుముందు చాలా విన్నానని.. ఇప్పటి వరకు తాను ఇప్పటిదాకా చేయని పనులన్నీ ఇప్పుడు చేయబోతున్నానని చెప్పింది తమ్ము. మరి తమ్మూ ఎప్పుడూ చేయని ఆ పనులేంటో.. అవి చేశాక అయినా వాటి గురించి వెల్లడిస్తుందేమో చూడాలి.

‘క్వీన్’ తెలుగు రీమేక్ మాత్రమే కాదు.. తమిళం.. కన్నడ.. మలయాళ రీమేక్స్ కూడా ఒకేసారి ఒకేచోట షూటింగ్ జరుపుకుంటుండటం విశేషం. తెలుగు-తమిళ వెర్షన్లకు నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు వెర్షన్ కు ‘క్వీన్’ అనే టైటిలే ఖాయం చేయగా.. తమిళంలో ‘ప్యారిస్ ప్యారిస్’ అని పేరు పెట్టారు. అందులో కాజల్ లీడ్ రోల్ చేస్తోంది. కన్నడలో పారుల్ యాదవ్ ప్రధాన పాత్ర పోషిస్తుంటే.. మలయాళంలో మాంజిమా మోహన్ కథానాయిక. ఆ రెండు వెర్షన్లకూ రమేష్ అరవింద్ దర్శకుడు
Tags:    

Similar News